iDreamPost
android-app
ios-app

ఆక్సిజన్‌ మాస్క్‌తో విమానంలో సోనియా గాంధీ! ఏం జరిగిదంటే..

ఆక్సిజన్‌ మాస్క్‌తో విమానంలో సోనియా గాంధీ! ఏం జరిగిదంటే..

ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజీవ్ గాంధీ మరణం తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సోనియా.. అతి తక్కువకాలంలోనే కీలక నేతగా ఎదిగారు. ఆ తరువాత ఏఐసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. సుధీర్ఘ కాలం పాటు ఆ హోదాలో ఆమె పనిచేశారు. రాజకీయ వ్యవహారాలతో ఎప్పుడు బిజీ బిజీగా ఉండే ఆమె… ఇటీవల కొంతకాలం క్రితం అనారోగ్యం బారిన పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుని  కోలుకున్నారు. తరుచూ ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆక్సిజన్ పెట్టుకుని  విమానంలో కూర్చున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మంగళవారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెంగళూరులో విపక్షాల ఐక్యవేదిక సమావేశంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సమావేశానికి ముగించుకుని ఢిల్లీకి తిరిగి వెళ్తుండగా.. సాంకేతిక లోపం కారణంగా, వారి విమానం భోపాల్‌లోని రాజా భోజ్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయబడింది. దీంతో విమానంలో ఆక్సిజన్‌ ​​కొరత ఏర్పడింది. దీంతో సోనియా ఆక్సిజన్ మాస్క్ ధరించింది. ఇదే ఫోటోను రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ భావోద్వేగ పోస్ట్ రాశారు. తనకు అమ్మ సోనియా గాంధీ అంటే ఎంత ప్రేమో.. పలు సందర్భాల్లో రాహుల్‌ గాంధీ తీసుకునే జాగ్రత్త చర్యలే నిదర్శనం.

తాజాగా ఆకోవాలోనే తన అమ్మ ఫోటోను రాహుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “అమ్మా, ఒత్తిడిలో కూడా దయకు సరైన ఉదాహరణ” అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో కామెంట్ రాసుకొచ్చారు. చార్టర్డ్ విమానంలో ఆక్సిజన్ కొరత ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే పీసీ శర్మ అన్నారు.  అందుకే సోనియా గాంధీ ఆక్సిజన్ మాస్క్ ధరించారని ఆయన తెలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెంగళూరు నుంచి ఢిల్లీకి ఈ విమానంలో వెళ్తున్నారు.  అత్యవసర ల్యాండింగ్ తర్వాత ఇద్దరూ భోపాల్ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లోఉన్నారు. ఈ సందర్భంగా భోపాల్‌కు చెందిన కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకుని సోనియా, రాహుల్ గాంధీలను కలిశారు.

దాదాపు గంటన్నర సేపు భోపాల్‌ ఎయిర్‌పోర్టులో బస చేసిన అనంతరం ఇద్దరూ రాత్రి 9.35 గంటలకు ఇండిగో సంస్థకు చెందిన విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కాగా, మంగళవారం బెంగళూరులో విపక్షాల ఐక్యవేదిక రెండో రోజు సమావేశం ముగిసింది.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంగా 26 ప్రతిపక్ష పార్టీలు ఒక్కటయ్యాయి. ఈ సమావేశంలో విపక్షాల కూటమి పేరును I.N.D.I.Aగా ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్  అవుతున్న సోనియా ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేండి.

 

View this post on Instagram

 

A post shared by Rahul Gandhi (@rahulgandhi)

ఇదీ చదవండి: వీడియో: మహిళా రైతులతో సోనియా గాంధీ డ్యాన్స్‌..