iDreamPost

వీడియో: మహిళా రైతులతో సోనియా గాంధీ డ్యాన్స్‌..

వీడియో: మహిళా రైతులతో సోనియా గాంధీ డ్యాన్స్‌..

ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురించి ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. రాజీవ్ గాంధీ మరణానంతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువకాలంలో కీలక నేతగా ఎదిగారు. ఆ తరువాత చాలా ఏళ్ల పాటు జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షురాలిగా కొనసాగారు. ఇలా సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో కొనసాగుతున్న ఆమె ఎప్పుడు బిజీ బిజీగా కనిపిస్తుంది. అలాంటి ఆమె.. రైతులతో కలిసి డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయాల్లో చాలా బిజీబిజీగా ఉన్నారు. గత కొన్ని రోజుల క్రితం  అనారోగ్యంతో ఆమె బాధపడిన విషయం తెలిసిందే. చాలా రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం ఇంటికి రావడంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. అలానే  అధికారం లేక నిరాశలో ఉన్న కాంగ్రెస్ కు కర్ణాటక మంచి బలాన్ని ఇచ్చింది. ఇలాంటి తరుణంలా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటలని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ఇతర ముఖ్యనేతలు వివిధ రాష్ట్రాల నేతలు తరచూ సమావేశం అవుతున్నారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు ప్రజలతో మమేకమవుతున్నారు. అలానే తాజాగా సోనియా గాంధీ..తన నివాసంలో హర్యాణ మహిళ రైతులతో ముచ్చటించారు. తనను కలిసేందుకు వచ్చిన రైతులతో కలిసి సోనియా డ్యాన్స్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెటింట తెగ వైరల్ అవుతోంది. జులై 8న రాహుల్‌గాంధీ హర్యాణాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సోనీపత్‌ జిల్లాలోని మదీనా గ్రామంలో మహిళా రైతులు కలిశారు. తాము దిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటిని చూడాలని కోరారు.  ఆ సమయంలో వారికి తమ  ఇళ్లు చూపిస్తానని రాహుల్ గాంధీ మాటిచ్చారు.

దీంతో తాజాగా రాహుల్‌ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి వారిని సోనియా నివాసానికి ఆహ్వానించారు. మహిళా రైతులను సోనియా సాదరంగా ఆహ్వాచారు. వారికి ప్రత్యేక ఆతిథ్యం ఏర్పాటు  చేశారు. సోనియా, ప్రియాంక గాంధీ కూడా మహిళ రైతులతో కలిసి భోజనం చేశారు. అనంతరం వారితో సరదాగా ముచ్చటించారు. అనంతరం సోనియాను మహిళా రైతులు నృత్యం చేయాలని కోరారు. దీంతో అందుకు ఆమె అంగీకరించి వారితో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను కాంగ్రెస్‌ నేత ఒకరు పంచుకుంటూ…. ఇది స్వచ్ఛమైన సంతోషం అని రాసుకోచ్చారు. మరి.. సోనియా గాంధీ డ్యాన్స్ చేసిన వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రాజకీయాల్లోకి అభిషేక్ బచ్చన్.. ఆ నియోజక వర్గం నుంచే పోటీ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి