సోనియా గాంధీ, రాహుల్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం!

సోనియా గాంధీ, రాహుల్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం!

ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేంతిక లోపం తలెత్తింది. దీంతో మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో వారి విమానం దిగింది.  ప్రతికూల వాతావరణ కారణంగా భోపాల్ లోని విమానశ్రయంలోని  వీరి ప్రయాణిస్తున్న విమానం ల్యాండ్ అయింది. ఈ రోజు కర్ణాటకలోని బెంగుళూరులో విపక్షాల కూటమి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం వారు బెంగుళూరు నుంచి ఢిల్లీకి  తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో విమానాన్ని భోపాల్‌ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ రాహుల్, సోనియా ప్రయాణిస్తున్న విమానం ల్యాండిగ్ జరిగింది.

విమానం సురక్షితంగా ల్యాండ్‌ అవడంతో కాంగ్రెస్‌ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి. అక్కడి నుంచి ఇండిగో విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నట్లు సమాచారం. బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశంలో రాహుల్, సోనియాలతో పాటు 26 పార్టీలు పాల్గొన్నాయి. ఈ మేరకు ఎన్టీయేను ఎదుర్కోవడానికి తమ కూటమికి I.N.D.I.A అని పేరు పెట్టారు. అలాగే, తదుపరి సమావేశం ముంబైలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కూటమి సమావేశంలో విపక్ష నేతల కూటమి పేరుతో పాటు పలు ఇతర ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఢిల్లీలో ఈ కూటమి కోసం ఒక ఉమ్మడి కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలానే 11 మంది సభ్యులతో ఒక సమన్వయ కమిటీ కూడ ఏర్పాడు చేయాలని నిర్ణయించారు. సమన్వయ కమిటీ సభ్యుల పేర్లను ముంబై సమావేశంలో ప్రకటిస్తామని తెలిపారు.

Show comments