Idream media
Idream media
ప్రత్యేక హోదా ఆయుధంగా వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కారుపై విరుచుకుపడాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెగ ఉబలాటపడుతున్నారు. అసలు హోదా దారి మళ్లింది తన వల్లేనని తెలిసినా .. అవకాశం వచ్చినప్పుడల్లా ఈ అంశాన్ని లేవనెత్తి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు బాబు. పార్లమెంట్‌లో ఏపీ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించడం లేదని, వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ప్రత్యేక హోదాపై ఇంకెన్నాళ్ల్లు ప్రజల్ని మభ్యపెడతారంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. అంతేకాదు.. ప్రత్యేక హోదా తీసుకురానందుకు సీఎం జగన్ రాజీనామా చేయాలన్న వ్యాఖ్యలూ చేశారు. ఇది మోసం, దగా అంటూ.. పెద్ద పెద్ద డైలాగులు కూడా చాలా సార్లు వాడారు.
ఏపీని సొంత ప్రయోజనాల కోసం కేంద్రానికి తాకట్టుపెట్టారంటూ తీవ్రంగా ధ్వజమెత్తే చంద్రబాబు బండారాన్ని మరోసారి బయటపెట్టారు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. గతంలో కూడా పలుమార్లు బాబుపై విమర్శలు గుప్పించిన వీర్రాజు తాజాగా మరోసారి మాట్లాడడం గమనార్హం.
అందరికీ తెలిసిన విషయమే అయినా.. ఏపీకి చంద్రబాబు చేసిన అన్యాయాన్ని బహిరంగ సభ వేదికగా మరోసారి వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేక హోదా వద్దన్నాడనే విషయాన్ని గుర్తుచేశారు సోము వీర్రాజు. చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దని, ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నారని సోము వీర్రాజు స్పష్టం చేశారు. చంద్రబాబు వద్దన్నాడనే కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. బహిరంగ సభలో సోము వీర్రాజు మాట్లాడుతూ.. ‘అమరావతిని సింగపూర్, జపాన్ చేస్తా అంటూ చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. ప్రజల డబ్బుతో చంద్రబాబు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నారు. ప్రత్యేక హోదా అంటున్నారు…ఎందుకు వద్దన్నాడో చంద్రబాబుని అడగండి. చంద్రబాబు ప్రత్యేకహోదా వద్దు… ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నారు. చంద్రబాబు వద్దన్నాడని ప్రత్యేక హోదా ఇవ్వలేదు’ అని తెలిపారు.
మరి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు లక్ష్యం నెరవేరుతుందా? ప్రత్యేక హోదా సాధించలేదనే నెపం వైసీపీ సర్కారుపై వేస్తే జనం నమ్ముతారా? అనేది టీడీపీ నేతలు ఆలోచించాలి. ఓ వైపు జనసేన, బీజేపీతో కలిసి పనిచేయాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో సోము ఇలా చంద్రబాబుపై వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Also Read : జగన్ వద్ద 9 రత్నాలే.. మోదీ వద్ద 90 రత్నాలున్నాయట..!