iDreamPost
android-app
ios-app

తిరుపతికి కూడా సోమిరెడ్డే నా?మంచి గెలుపు ట్రాక్ రికార్డ్ ఉన్న నేతలే దొరకలేదా?

తిరుపతికి కూడా సోమిరెడ్డే నా?మంచి గెలుపు ట్రాక్ రికార్డ్ ఉన్న నేతలే దొరకలేదా?

మరో కొద్ది రోజుల్లో జరగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో పరువు నిలుపుకునేందుకు ప్రతిపక్ష టీడీపీ ఆపసోపాలు పడుతోంది. పోటీలో ఉండేందుకు సుముఖత వ్యక్తం చేయని పనబాక లక్ష్మీని బలవంతంగా టీడీపీ బరిలో నిలిపింది. ఉప ఎన్నికల పర్యవేక్షణ బాధ్యత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కి చంద్రబాబు అప్పగించారు. వరుసగా ఓడిపోయిన సోమిరెడ్డి కి బాధ్యతలు అప్పగించడంపై ఆ పార్టీ శ్రేణుల్లో నిరాశ ఎదిరవుతుంది. సొంతంగా గెలవలేని ఆయన ఇక్కడికి వచ్చి ఎంపీని గెలిపించగలరా? అని ఆ పార్టీ కార్యకర్తలే ప్రశ్నించుకుంటున్నారు.

ఒక్కరూ లేరా..?
తిరుపతి లోక్ సభ స్థానం ఇటు చిత్తూరులో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు, అటు నెల్లూరులో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉంది. మాజీ సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నికలో ఆ పార్టీకి దిశానిర్దేశం చేసే వారే లేకుండా పోయారు. టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు తరువాత అంతటి కీలక నేత బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి 2017లో మంత్రి పదవి తప్పించిన కొడుకుకు వారసత్వం ఇచ్చి రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు . మరో నేత గాలి ముద్దుమ కృష్ణ, మాజీ ఎంపీ శివ ప్రసాద్ మరణించడంతో ఆయన లేని లోటును ఎవరూ భర్తీ చేయలేక పోతున్నారు.

Also Read:ఎవరీ నగరాలు?విజయవాడ రాజకీయాల్లో ఎలా కీలకం అయ్యారు?

వరుసగా 5 సార్లు ఓటమి.!
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 2004, 2009, 2012(ఉప ఎన్నిక), 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఐదు సార్లు ఓడిపోయారు. అయినా, సోమిరెడ్డిని ఎమ్మెల్సీ చేసి మరీ గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తన కేబినెట్ లో మంత్రిని చేశారు.

2001లో సోమిరెడ్డి మంత్రి పదవి విషయంలో మోసం చేశాడన్న కోపంతో నిన్ను జీవితంలో గెలవనివ్వను అని సవాలు విసిరిన ఆదాల ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్,టీడీపీ,వైసీపీ తరుపున గెలిచారు,మొత్తం ఐదు ఎన్నికల్లో నాలుగుసార్లు గెలిచాడు. మంత్రి పదవిలో విబేధాలు వచ్చిన సొంత బావ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు . సోమిరెడ్డి ని మాత్రం అపజయాల పరంపర వెంటాడుతుంది.

ఇప్పటికే పర్యవేక్షణ కమిటీ..!
తిరుపతి ఉప ఎన్నిక కోసం చంద్రబాబు పర్యవేక్షణ కమిటీ వేశారు. ఇందులో సభ్యులుగా లోకేష్ , అచ్చెన్న, పనబాక కృష్ణయ్య, బీదా రవిచంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. ఏప్రిల్ 17వ తేదీన జరగనున్న తిరుపతి ఉప ఎన్నికకు తెలుగుదేశం పార్టీ నుండి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పోటీలో నిలపాలని భావించిన చంద్రబాబు ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డాలని పార్టీ శ్రేణులకు ఇప్పటికే సూచించారు. ఇదిలా ఉంటే మార్చి 24 వ తేదీన పనబాక లక్ష్మి తెలుగుదేశం పార్టీ తరఫున తిరుపతి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.

Also Read:దటీజ్ దొరబాబు !

పోటీలో నిలిచేనా..?
తిరుపతి ఉప ఎన్నిక మెజారిటీ గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని ఇప్పటికే సీఎం జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. వైసీపీ నేతలు 3 లక్షల మెజారిటీ సాధిస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కనీసం పోటీ ఇవ్వగలదా అనే సందేహం వ్యక్తం అవుతోంది. చంద్రబాబు తన సొంత జిల్లాలో జరుగుతున్న ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దేనితో ఫలితం ఏ మాత్రం ఆశాజనకంగా లేకున్నా టీడీపీ పని అయిపోయినట్లే..!