Idream media
Idream media
నవ్విపోదురు గాక.. నాకేంటి అనే రీతిలో ఉంటోంది కొందరు తెలుగుదేశం పార్టీ నేతల తీరు. రాష్ట్రంలోని పలు అంశాలపైనే కాదు.. తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటులో కూడా వింత వైఖరిని ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా మంచి జరిగిందంటే తమ అకౌంట్ లో వేసుకోవాలని తాపత్రయ పడుతున్నారు. అధికారంలో లేకపోయినా అలా చెబితే ప్రజలు నమ్ముతారా, లేదా అనే సందేహాలు కూడా వారికి రావడం లేదు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీరు అలానే ఉంది.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడడంతో ఆ పార్టీ నేతలు కలవరానికి గురవుతున్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాల నుంచి తేరుకుని పార్టీని గాడిన పెట్టేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు సంతోషించిన అంశం ఉందంటే.. వెంటనే దాని వెనుక ఉన్నది తామేనని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా మొత్తం మాట అలా ఉంచితే ఆ ఒక్క నియోజకవర్గంలో మాత్రం అదే జరుగుతోంది. తెలుగు దేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్ ను కాపాడుకోవడం కోసం విశేషంగా పాటుపడుతున్నారు. తాజాగా ఏపీలో జిల్లాల విభజన అంశంలో తమ ప్రాంతానికి ప్రాధాన్యం దక్కడానికి తానే కారణమని చెప్పుకుని తిరుగుతుండడం హ్యాస్యాస్పదంగా మారింది.
తిరుపతి పార్లమెంట్ కేంద్రంగా బాలాజీ జిల్లా ఏర్పాటు చేయనున్నట్లు జగన్ సర్కారు ప్రకటించింది. ఇదే లోక్ సభ పరిధిలో సర్వేపల్లి నియోజకవర్గం కూడా ఉంది. లోక్ సభ పరిధిలో ఉన్న సర్వేపల్లి నెల్లూరు నగరానికి మూడు వైపులా ఉంది. దీంతో నెల్లూరు జిల్లాలోనే సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం వద్ద పట్టుబట్టి సాధించామని కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఇందులో కాకాని గొప్పతనం ఏమీ లేదంటున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తాను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దృష్టిలో పెట్టడం వల్లే సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలో కొనసాగించడం సాధ్యపడిందని ఆయన అంటున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు కాకాని. బాల నాగమ్మ సినిమా లోని తిప్పడు పాత్రతో పోల్చి సోమిరెడ్డి పై సెటైర్ వేశారు. సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కొనసాగడం తన క్రెడిట్‌గా సోమిరెడ్డి మాట్లాడటం విడ్డూరమంటూ ఎద్దేవా చేశారు.
Also Read : ఎందుకు దీక్ష చేస్తున్నారో మీకైనా తెలుసా ఉమా?