iDreamPost
android-app
ios-app

వైరల్ గా మారిన స్మృతి ఇరానీ మోడలింగ్ వీడియో

వైరల్ గా మారిన స్మృతి ఇరానీ మోడలింగ్ వీడియో

స్మృతి ఇరానీ అరుదైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే స్మృతి ఇరానీ ఒకప్పుడు కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన మోడల్ అని చాలామందికి తెలియదు.

కాగా తాజాగా స్మృతి ఇరానీ మిస్ ఇండియా కాంటెస్ట్ లో పాల్గొన్న అరుదైన వీడియోను ఆమె స్నేహితురాలు, నిర్మాత ఏక్తా కపూర్ షేర్ చేశారు. ఏక్తా కపూర్ షేర్ చేసిన స్మృతి ఇరానీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 1998 లో జరిగిన మిస్ ఇండియా కాంటెస్ట్ లో పాల్గొన్న స్మృతి ఇరానీ ఆ వీడియోలో తనకి రాజకీయాలు అంటే ఎంతో ఇష్టమని ఆసక్తి ఉందని తెలిపారు. కాగా మిస్ ఇండియా కాంటెస్ట్ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన స్మృతి ఇరానీ తన వ్యూహ చతురతతో రాజకీయాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేస్తున్న విషయం తెలిసిందే.

బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్, స్మృతి ఇరానీ మంచి స్నేహితులు. పాలిటిక్స్ లో అడుగుపెట్టకముందు స్మృతి ఇరానీ,నిర్మాతగా టీవీ నటిగా రాణించారు. మోడలింగ్ లో కూడా తనదైన ముద్ర వేశారు. ఏక్తా కపూర్ షేర్ చేసిన నాటి వీడియో ఇప్పుడు వైరల్ అయింది. నా స్నేహితురాలిని చూసి ఎంతో గర్వ పడుతున్నానని, వినయం, మాట నిలబెట్టుకొనే తత్వమే స్మృతీ ఇరాని అద్బుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయని ఏక్తా కపూర్ వెల్లడించారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss