iDreamPost
android-app
ios-app

చితక్కొట్టిన SRH బ్యాటర్.. టోర్నీ హిస్టరీలోనే బెస్ట్ స్కోర్!

  • Author singhj Published - 04:33 PM, Tue - 17 October 23
  • Author singhj Published - 04:33 PM, Tue - 17 October 23
చితక్కొట్టిన SRH బ్యాటర్.. టోర్నీ హిస్టరీలోనే బెస్ట్ స్కోర్!

మన దేశంలో ప్రస్తుతం ఉన్న బెస్ట్ టాలెంటెడ్ యంగ్ క్రికెటర్స్​లో అభిషేక్ శర్మ ఒకడు. లెఫ్టాండర్ అయిన అభిషేక్ బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ సత్తా చూపించగలడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో పలుమార్లు తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. పొట్టి లీగ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్​కు ఆడుతున్న అభిషేక్ శర్మ ఓ తుఫానీ ఇన్నింగ్స్​తో మళ్లీ వార్తల్లో నిలిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్​లో విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఆంధప్రదేశ్​తో రాంచీ వేదికగా ఇవాళ జరుగుతున్న మ్యాచ్​లో అభిషేక్ 42 బంతుల్లోనే వంద మార్క్​ను చేరుకున్నాడు.

ఆంధ్రాతో జరుగుతున్న మ్యాచ్​లో అభిషేక్ శర్మ 9 ఫోర్లతో పాటు ఏకంగా 9 సిక్సులు బాదాడు. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ 112 రన్స్ చేసి పెవిలియన్​కు చేరుకున్నాడు. అభిషేక్​తో పాటు అన్మోల్ ప్రీత్ సింగ్ కూడా చెలరేగడంతో పంజాబ్ భారీ స్కోరు చేసింది. అన్మోల్ 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్​ను చేరుకున్నాడు. అతడు మొత్తంగా 26 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 87 రన్స్ చేసి ఔటయ్యాడు. అన్మోల్ బ్యాటింగ్​ చేస్తున్న తీరుకు ఒక దశలో టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ స్టీఫెన్ బౌలింగ్​లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన తర్వాత అతడు ఔటయ్యాడు. మరో 13 రన్స్ చేస్తే అతడి సెంచరీ పూర్తయ్యేది.

క్రీజులో ఉన్నంత సేపు ఆంధ్రా బౌలర్లను వణికించిన అన్మోల్ కొద్దిలో టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసే ఛాన్స్​ను మిస్ చేసుకున్నాడు. అతడితో పాటు అభిషేక్ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్​తో విరుచుకుపడటంతో టాస్ గెలిచి బ్యాటింగ్​కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 275 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో టోర్నీ హిస్టరీలోనే అత్యధిక స్కోరు చేసిన టీమ్​గా పంజాబ్ రికార్డు సృష్టించింది. ఇక, ఆంధ్రప్రదేశ్ బౌలర్లలో పృథ్వీరాజ్ యర్రా, చీపురుపల్లి స్టీఫెన్, త్రిపురన విజయ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అయితే అభిషేక్, అన్మోల్ బ్యాటింగ్​లో చితక్కొట్టడంతో బలైన ఆంధ్రా బౌలర్లు 10కి పైగా యావరేజ్​తో రన్స్ సమర్పించుకున్నారు. పృథ్వీరాజ్, హరిశంకర్​రెడ్డి అయితే ఏకంగా 15కు పైగా సగటుతో రన్స్ సమర్పించుకున్నారు. మరి.. ఎస్​ఆర్​హెచ్ బ్యాటర్ అభిషేక్ బ్యాటింగ్ విధ్వంసంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: దేశం కోసం.. వెన్నునొప్పిని లెక్కలేయకుండా బరిలోకి దిగాడు!