iDreamPost
android-app
ios-app

ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా ఏకగ్రీవమే

  • Published Mar 05, 2021 | 3:18 AM Updated Updated Mar 05, 2021 | 3:18 AM
ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా ఏకగ్రీవమే

ఏపీలో ఏకగ్రీవాల పరంపర కొనసాగుతోంది. ఎన్నికలు ఏమయినా ఫలితం మాత్రం ఏకగ్రీవంగా వస్తోంది. ఇప్పటికే పంచాయితీలలో అదే కనిపించింది. తాజాగా మునిసిపాలిటీలలో సైతం అవే ఫలితాలు. ఇప్పుడు విధాన పరిషత్ ఎన్నికల్లోనూ విధానం మారలేదు. అధికార వైఎస్సార్సీపీ విజయపరంపర ఆగలేదు. ప్రతిపక్ష తెలుగుదేశం పోటీకి దిగలేదు. దాంతో ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు ఎమ్మెల్సీల కోసం జరిగిన ఎన్నికల్లో నామినేషన్లు వేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థులంతా ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.

Also Read:కార్పోరేటర్ చాలు అనుకుంటే ఏకంగా ఎమ్మెల్సీ పదవి వరించింది .

జగన్ నుంచి ఉదయం బీ ఫారం అందుకుని నామినేషన్లు దాఖలు చేసిన అధికార పార్టీ అభ్యర్థులు మహమ్మద్‌ ఇక్బాల్‌, కరీమున్నీసా, బల్లి కల్యాణ్‌ చక్రవర్తి, చల్లా భగీరథ రెడ్డి, దువ్వాడ శ్రీనివాస్‌, సి.రామచంద్రయ్య శాసనమండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ ఆరుగురు మినహా మరెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడం, ఫలితం ఏకగ్రీవం అయ్యింది. ఆరు ఎమ్మెల్సీలు గెలిపించుకోవడంతో వైఎస్సార్సీపీకి మండలిలో బలం పెరిగింది తాజా ఎమ్మెల్సీలతో కలిపితే 18కి చేరింది. రాబోయే మే నెలలో టీడీపీ ఎమ్మెల్సీలు రిటైర్ కాబోతున్నారు. అందులో మండలి చైర్మన్ షరీఫ్ కూడా ఉన్నారు. దాంతో మే నాటికి మండలిలో వైఎస్సార్సీపీ ఆధిక్యం ఖాయంగా కనిపిస్తోంది. జూన్ లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే సంపూర్ణ ఆధిపత్యం మండలిలో సైతం దక్కుతుంది

ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో బరిలో దింపేందుకు అభ్యర్థులు లేక సతమతమవుతున్న టీడీపీకి, తాజాగా మండలి ఎన్నికల్లో కూడా పోటీచేయలేకపోవడం ఆసక్తిగా మారింది. గతంలో రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసినా వర్ల రామయ్యని బరిలో దింపిన చంద్రబాబు ఈసారి మొఖం చాటేశారు. కనీసం పోటీ లో నిలిచేందుకు సైతం ముందుకు రాలేదు. దాంతో టీడీపీ తీరు చర్చనీయాంశం అవుతోంది. ఆపార్టీకి బరిలో నిలిచేందుకు కూడా ఎవరూ కనిపించని పరిస్థితి ఏర్పడడం పంచాయితీ వార్డు మెంబర్ నుంచి శాసనమండలి సభ్యుడి వరకూ కనిపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Also Read:పెద్దల సభలోనూ వైసీపీ పైచేయి.. మారుతున్న సమీకరణాలు

ఈసారి వైఎస్సార్సీపీ తరుపున పలువురు సామాన్యులకు చోటు కల్పించడం ద్వారా తమ పార్టీ అధినేత తీరు స్పష్టమయ్యిందని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీలో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత దక్కుతుందనడానికి ఇదే నిదర్శనంగా చెబుతున్నారు.