iDreamPost
android-app
ios-app

మరో కొత్త అమ్మాయితో రాహుల్ సిప్లిగంజ్.. ఈమె ఎవరంటే?

  • Published Jun 19, 2024 | 5:51 PMUpdated Jun 19, 2024 | 5:51 PM

Rahul Sipligun: ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ సింగర్ గా తనదైన గానంతో ఒక బ్రాండ్ ఇమేజ్ ను ఏర్పాటు సింగర్ లో రాహుల్ సిప్లిగంజ్ కూడా ఒకరు. అయితే తాజాగా రాహుల్ మరో కొత్త అమ్మాయితో ఓ పోస్ట్ ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. ఇంతకి రాహుల్ పక్కన ఉన్నా అమ్మాయి ఎవరంటే..

Rahul Sipligun: ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ సింగర్ గా తనదైన గానంతో ఒక బ్రాండ్ ఇమేజ్ ను ఏర్పాటు సింగర్ లో రాహుల్ సిప్లిగంజ్ కూడా ఒకరు. అయితే తాజాగా రాహుల్ మరో కొత్త అమ్మాయితో ఓ పోస్ట్ ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. ఇంతకి రాహుల్ పక్కన ఉన్నా అమ్మాయి ఎవరంటే..

  • Published Jun 19, 2024 | 5:51 PMUpdated Jun 19, 2024 | 5:51 PM
మరో కొత్త అమ్మాయితో రాహుల్ సిప్లిగంజ్.. ఈమె ఎవరంటే?

సింగర్ ‘రాహుల్ సిప్లిగంజ్’.. ఈ పేరు గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీతో నాటు నాటు సాంగ్ కు తన గాత్రం అందించడంతో.. రాహుల్ చాలా ఫ్యామస్ అయిపోయాడు,. ఎందుకంటే.. ఈ సినిమాలో ఆ పాట ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో.. రహుల్ క్రేజ్ మొత్తం మారిపోయింది. అయితే మొదట్లో కేవలం ఒక ప్రైవేట్ సాంగ్స్ అల్బమ్స్ చేస్తూ అదరగొట్టిన రాహుల్ ఆ తర్వాత కాలంలో సినిమాల్లో అవకాశాలు అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ ను పాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా.. ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ సింగర్ గా మారిపోయాడు. ఇదిలా ఉంటే..రాహుల్ ఇన్ స్టా గ్రామ్ లో ఓ న్యూ రీల్ ను పోస్ట్ చేశాడు. కాగా, ఆ వీడియోలో ఓ అమ్మాయిని పరిచయం చేస్తూ.. తనకి విషెష్ తెలియజేశాడు.ప్రస్తుతం ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో.. నెట్టింట ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరా అని ఆరాతీస్తున్నారు.

ఇండస్ట్రీలో తనదైన గానంతో ఒక బ్రాండ్ ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు రాహుల్ సిప్లిగంజ్.ఈ క్రమంలోనే తన టాలెంట్ తో పాటు చూపిస్తూ మోస్ట్ బిజీ సింగర్స్ లో ఒకడిగా మారిపోయాడు. అయితే రాహులు పాటలతోనే కాదు.. అమ్మాయిలతో కూడా ఫేమస్ అవ్వడం కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు అని అనుకుంటున్నరా..? మరెమీ లేదండీ.. తాజాగా ఈ యంగ్ సింగర్ తన ఇన్ స్టా గ్రామ్ లో తన కొత్త క్వీన్ పరిచయం చేస్తూ.. ఆమెకు బర్త్ డే విషెష్ కూడా తెలియజేశారు. ఇక ఈ వీడియోకి సో క్యూట్ అంటూ.. యాంకర్ వర్షిణి వాళ్లు చాలామంది కామెంట్లు పెడుతు్నానరు. దీంతో ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఇంతకి ఈ అమ్మాయి ఎవరో అని అందరూ ఆరాతీస్తున్నారు.

అయితే రాహుల్ చేసిన రీల్ కనిపిస్తున్న అమ్మాయి పేరు హరిణ్య రెడ్డి.. వీరిద్దరూ కలిసి ఏదో అల్బమ్ చేస్తున్నారని, ప్రస్తుతం వీరు ఫారిన్ ట్రిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగానే రాహుల్ ఆమెకు విషెష్ చెప్పి .. ఆమెతో కలిసి దిగిన ఫోటోను షేరు చేశాడని సమాచారం. అయితే హరిణ్య రెడ్డికి సోషల్ మీడియాలో.. రాహుల్ సిప్లిగంజ్ తో పాటు, అరియానా,అషురెడ్డి, యాంకర్ విష్ణు ప్రియ, యాంకర్ స్రవంతి, సొహైల్, వైవా హర్ష, సింగర్ కృష్ణ చైతన్య, గీతా మాధురి వీళ్లంతా ఫాలోవర్స్ గా ఉండటం గమన్హారం. దీంతో ఈమె కూడా ఒక సెలబ్రిటీనే అని తేలిపోయింది.

ఇదిలా ఉంటే.. గతంలో రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్ సీజన్ 3లో పునర్నవితో జరిగిన లవ్ ట్రాక్ గురించి తెలిసిందే. ఇక ఈ సీజన్ తర్వాత కూడా వీరిద్దరూ కొన్నాళ్లు రిలిషిన్ లో ఉండగా.. ఆ తర్వాత ఎవరు దారి వారు చూసుకున్నారు. ఇక ఆ తర్వాత.. బిగ్ బాస్ సీజన్ 7వ లో రతికాతో కూడా రాహుల్ మాజీ ప్రేయసి అనే విసయం తెలిసిందే. ఇక ఈ సీజన్ మొదలైనప్పుడు రాహుల్, రతికా మధ్య జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఆ తర్వాత అషురెడ్డి కొన్నాళ్లు క్లోజుగా కలిసి తిరిగిన విషయం తెలిసిందే. కాగా, మళ్లీ ఇప్పుడు రాహుల్ లిస్ట్ లో ఈ కొత్త అమ్మాయి చేరడంతో.. కనీసం ఈ రిలేషన్ ని అయినా కంటిన్యూ చేస్తాడా లేదంటే లిస్ట్ ని పెంచుకుంటా పోతాడ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rahul Sipligunj (@sipligunjrahul)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి