iDreamPost

సిమ్ కొనుగోలుదారులు అలెర్ట్! ఇలా జరిగితే రూ.10 లక్షలు విధించవచ్చు!

సిమ్ కొనుగోలుదారులు అలెర్ట్! ఇలా జరిగితే రూ.10 లక్షలు విధించవచ్చు!

ఈ మధ్యకాలంలో నకిలీ సిమ్ కార్డుతో కొందరు కేటుగాళ్లు అనేక రకాల మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. వీటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా సరికొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ నూతన నిబంధనల ప్రకారం నడుచుకోకుంటే రూ.10 లక్ష జరిమానా కూడా విధించే అవకాశం లేకపోలేదని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ తాజా సర్క్యులర్ తో కొత్త సిమ్ కార్డు కొనుగోలు దారులు అలెర్ట్ అవుతున్నారు. అసలు కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన కొత్త నిబంధనల్లో ఏముంది? ఎందుకు రూ.10 లక్షల జరిమానా విధిస్తారనే పూర్తి వివరాలు మీ కోసం.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మారుతున్న కాలానికి అనుగుణంగా మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. కొందరు ఫేక్ రాయుళ్లు నకిలీ సిమ్ ల పేరుతో ఎన్నో మోసాలకు పాల్పడుతున్నారు. వీటన్నిటినీ అరికట్టేందుకు టెలికమ్యూనికేషన్ విభాగం గురువారం నిబంధనలతో కూడిన సర్క్యులర్ ను టెలికాం కంపెనీలకు పంపించింది. ఈ నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుందని కూడా తెలపింది. అయితే సెప్టెంబర్ 30 లోపు తమ పాయింట్ ఆఫ్ సేల్ (POS)అన్నింటినీ నమోదు చేసుకోవాలి.

సిమ్ విక్రయ కేంద్రాలు పత్రాలు సమర్పించి సెప్టెంబర్ చివరిలోపు నమోదు చేసుకోవాలి. మరో విషయం ఏంటంటే? సెప్టెంబర్ 30 తర్వాత ఏదైన కొత్త పీఓఎస్ నమోదు చేయకుండానే లైసెన్స్ దారులు కొత్త సిమ్ కొనేవారిని నమోదు చేసుకోవడానికి అనుమతిస్తే జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. వారిపై రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించవచ్చని తెలిపింది. ఇది సిమ్ అన్ని సిమ్ విక్రయ కేంద్రాలు పాటించాలని తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి