iDreamPost
android-app
ios-app

కాపురం చేసి పిల్ల‌ల‌ను క‌న‌డానికి, జీవిత‌ఖైదీకి పెరోల్ ఇవ్వొచ్చా? సంయోగ హక్కులపై సుప్రీం విచార‌ణ‌

  • Published Jul 26, 2022 | 3:57 PM Updated Updated Jul 26, 2022 | 3:57 PM
కాపురం చేసి పిల్ల‌ల‌ను క‌న‌డానికి, జీవిత‌ఖైదీకి పెరోల్ ఇవ్వొచ్చా? సంయోగ హక్కులపై సుప్రీం విచార‌ణ‌

సంతానం కోసం జీవిత ఖైదీకి పెరోల్ మంజూరు చేయాలన్న హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా రాజస్థాన్ ప్రభుత్వం చేసిన అప్పీల్‌, సుప్రీం ముందుకొచ్చింది. ఒక క్రిమిన‌ల్ కి జీవిత ఖైదును విధించారు. అత‌ని ద్వారా భార్య పిల్ల‌ల‌ను క‌న‌డానికి పెరోల్ ఇవ్వొచ్చా? అనేక‌ హైకోర్టులు ఈ అంశంపై పరస్పర విరుద్ధమైన తీర్పులను ప్ర‌క‌టించారు.

భార్య‌తో కాపురం చేయ‌డానికి జీవిత ఖైదీకి 15 రోజుల పెరోల్ మంజూరు చేయాలన్న రాష్ట్ర హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ, రాజస్థాన్ ప్రభుత్వంసుప్రీంకోర్టు త‌లుపుత‌ట్టింది.

ఖైదీల వైవాహిక హక్కులు, సంతానాన్ని క‌నే హ‌క్కుపై రాజ‌స్థాన్ హైకోర్టు సానుకూలంగా ఉండ‌గా, మ‌రికొన్ని హైకోర్టులు ఖైదీకి పెరోల్ ఇవ్వాల్సిన అవ‌స‌రంలేద‌ని తీర్పునిచ్చాయి. సంతానోత్పత్తి హక్కు ఖైదీకి ఉంది. అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు, స్వేచ్ఛ) పరిధిలోకి వస్తుందని కొందరు అభిప్రాయపడగా, పెరోల్ కి, జీవించే హ‌క్కుకు సంబంధంలేద‌ని అంటున్నారు.

ఎప్పుడైతే ఖైదీల‌కు కాపురం చేసే హ‌క్కునిచ్చిందో, అక్క‌డ నుంచి పిటీష‌న్ల వ‌ర‌ద‌మొద‌లైంది. మాకూ అలాంటి అవ‌కాశ‌మివ్వ‌మ‌ని చాలామంది జీవిత ఖైదీలు వేడుకొంటున్నారు.

తనకు పిల్ల‌లులేరు. భ‌ర్త జైల్లో ఉన్నాడు. పిల్ల‌ల‌ను క‌న‌డం నాకున్న జీవించే హ‌క్కులో భాగం. అందుకే సంతానం కలగాలంటే. తన భర్తను పెరోల్‌పై విడుదల చేయాలని వాదించిన జీవిత ఖైదీ భార్య పిటిషన్‌పై, హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఖైదీ దాంపత్య హక్కులను నెరవేర్చుకునే అవకాశాన్ని కాద‌న‌డం, భార్య హక్కులను నిరాక‌రించ‌డ‌మేన‌ని హైకోర్టు భావించింది.

రాజస్థాన్ ప్రభుత్వం కోర్టు ఉత్త‌ర్వులు రాష్ట్ర జైలు నిబంధనలకు అనుగుణంగా లేవ‌ని, సంతానం కోసం సహజీవనం పెరోల్‌కు స‌రైన కార‌ణం కాద‌ని సుప్రీం ఎదుట వాదించింది.

ఖైదీ భార్య‌ భార్యకు బిడ్డను కనే హక్కు కోసం పెరోల్ నివ్వ‌డం, నేర బాధితుల హక్కులను పూర్తిగా విస్మరించడమేన‌న్న‌ది రాజస్థాన్ ప్రభుత్వ వాద‌న‌. అదీ కూడా సమంజస‌మైన వాద‌నే న‌ని అంటున్నారు న్యాయ‌కోవిదులు.

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీజేఐ ధర్మాసనం వచ్చే వారం విచారణను చేప‌ట్ట‌నుంది. సుప్రీం కోర్టు ఇలాంటి అంశాన్ని విచారించ‌డం ఇదే మొద‌టిసారి. సుప్రీం ఇచ్చే తీర్పుమీద చాలా చ‌ర్చ జ‌రిగే అవ‌కాశ‌మూ ఉంది. కొత్త పిటీష‌న్లూ కోర్టు ముందుకు రావ‌చ్చు.

పెరోల్ అంటే? పెరోల్ అన్న‌ది ఖైదీకి, తాత్కాలికంగా ప్రత్యేక ప్రయోజనం కోసం లేదంటే పూర్తిగా జైలు శిక్ష ముగిసేలోపు విడుదల చేయడం. రాష్ట్రాల‌కు పెరోల్ కోసం కొన్ని రూల్స్ ఉన్నాయి.

పెరోల్ ఇవ్వడానికి దాంపత్య హక్కులు ఒక్కటే కారణం కాకూడ‌ద‌ని న్యాయవాదులంటున్నారు. ఖైదీ- బాధితుడి హక్కుల మ‌ధ్య త్రాసు స‌రిగా ఉండాలి. అంతేకాదు, దోషులు ఈ హక్కును దుర్వినియోగం చేయకుండా ఉండేలా తగిన రక్షణలను పేర్కొనాల‌ని అంటున్నారు.