Dharani
Dharani
ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న అవినాష్ రెడ్డి కిడ్నాప్ వ్యవహారం రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. పోలీసులు దర్యాప్తులో ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తోన్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిందితుడు చక్రధర్ గౌడ్‌తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ఈ కేసుకు సంబంధించి బాధితుడు అవినాష్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించాడు. అర్షిక రెడ్డితో ప్రేమాయణం, డబ్బల వ్యవహారం గురించి పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో కిడ్నాప్‌కు గల కారణాలు బయటకు వచ్చాయి.
‘‘నేను, అర్షిక.. సుమారే ఏడేళ్ల నుంచి అనగా 2016 నుండి ప్రేమించుకుంటున్నాం. ఉప్పల్ డిపో దగ్గర ఉన్న గల్లిగల్లికి మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ బంధం గురించి తెలుసు. మా తాత అర్షిక ఇంట్లో వాళ్లతో నా పెళ్లి గురించి మాట్లాడారు. మా ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. మా ఇద్దరిది సేమ్ క్యాస్ట్ కావడంతో ఎలాంటి సమస్య లేదు. కానీ అర్షిక కుటుంబసభ్యులు మాత్రం నెలలు గడుస్తున్నా పెళ్లి గురించి ఏమీ చెప్పలేదు. అర్షిక దగ్గర కూడా పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండేది. ఈ లోపు సిద్ధిపేటకు చెందిన చక్రధర్ గౌడ్‌తో అర్షిక ప్రేమాయణం నడుపుతున్నట్లు నాకు తెలిసింది. వాళ్లిద్దరు కలిసి ఉన్న ఫోటోలను నాకు పంపించారు’’ అని తెలిపాడు అవినాష్ రెడ్డి.
‘‘అర్షిక… నన్ను మోసం చేసి చక్రధర్ గౌడ్‌ని ప్రేమిస్తుందన్న విషయాన్ని నేనే అర్షిక అమ్మకు తెలిపారు. కానీ ఆమె ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. దాంతో నేను గతంలో అర్షికకు ఇచ్చిన డబ్బుల గురించి ఆమె తల్లికి చెప్పాను. నేను అర్షిక రూ. 25 లక్షలు ఇచ్చాను. ఆ విషయమే ఆమెకు చెప్పాను. కానీ ఆమె ఏం మాట్లాడలేదు. ఇదిలా ఉండగా.. పదిహేను రోజుల క్రితం నాకు చక్రధర్ గౌడ్ ఫోన్ చేశాడు. నేను బెంగుళూరులో ఉన్నానని, రాగానే సెటిల్ చేస్తానని చెప్పాడు. ఆదివారం నాకు చక్రధర్ ఫోన్ చేసి.. ఈ రోజు వస్తే.. నాకు ఇవ్వాల్సిన డబ్బుల విషయం సెటిల్ చేస్తాను అన్నాడు. అందుకోసం నన్ను ఘట్‌కేసర్‌లోని వందన హోటల్ దగ్గరికి రమ్మని పిలిచాడు. అక్కడకు వెళ్లిన తర్వాత నా కారు పార్క్ చేసి అతని కారులో కూర్చున్నాను. నాతో మాట్లాడుతూనే నన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు’’ అని చెప్పుకొచ్చాడు అవినాష్‌రెడ్డి.
‘‘దానిలో భాగంగా కారులో కూర్చున్న తర్వాత.. చక్రధర్ గౌడ్ ఎడమ చేత్తో నా గొంతు పట్టుకోగా.. వెనకాల కూర్చున్న మరో వ్యక్తి నా ఎడమ చేయి వెనక్కి లాగి పట్టుకున్నాడు. వాళ్ల నుంచి తప్పించుకుని.. డోర్ తీసి బయటికి వెళ్ళేందుకు ప్రయత్నం చేశాను. ఈ లోపు మరో వ్యక్తి వచ్చి డోర్‌కి అడ్డంగా నిలబడ్డాడు. దాంతో నేను బలంగా డోర్‌ని తోశాను. అనంతరం పెద్దగా కేకలు పెట్టాను. అక్కడ ఉన్న కొంతమంది కారు దగ్గరికి రావడంతో నన్ను కారులోంచి బయటకు నెట్టేసి పారిపోయారు’’ అని చెప్పుకొచ్చాడు.