Krishna Kowshik
Krishna Kowshik
దసరాకు మరింత పూనకాలు తెప్పించేందుకు సిద్ధమయ్యారు ఇళయదళపతి విజయ్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్. రెండు స్ట్రైట్ మూవీస్ భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు విడుదలౌతున్నా డేర్ చేస్తూ లియోను రంగంలోకి దింపుతున్నారు. మాస్టర్స్ తో హిట్‌ను తమ ఖాతాలో వేసుకున్న ఈ కాంబో.. మరోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ అయ్యారు. సినిమా విడుదలకు ముందే లియో రికార్డుల మోత మోగిస్తోంది. ఇంకా విడుదల కానేలేదు సుమారు మిలియన్ డాలర్ల బిజినెస్ చేసింది. ప్రీ సేల్ ద్వారా ఇంత మొత్తంలో కొల్లగొట్టిన ఏకైక భారతీయ చిత్రంగా ఇది రికార్డు సాధించింది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. కాగా, ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంటగా, సంజయ్ దత్, అర్జున్ సార్జా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువ కెరటం అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ నెల 19న తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతుంది లియో చిత్రం. అయితే ఈ సమయంలో తెలుగులో ఎదురు దెబ్బ తగిలినట్లయ్యింది. లియో తెలుగు వెర్షన్ పై హైదరాబాద్ సివిల్ కోర్టు స్టే విధించింది. లియో సినిమాను ఈ నెల 20వ తేదీ వరకు విడుదల చేయకూడదని ఆదే శాలు జారీ చేసింది. తెలుగులో లియో అనే టైటిల్ ఉపయోగించడంపై ఈ పిటిషన్ దాఖలైనట్లు సమాచారం. అయితే తెలుగులో ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై విడుదల చేస్తున్న సంగతి విదితమే. ఈ టైటిల్ విషయంలోనే కోర్టులో పిటిషన్ పేర్కొనగా.. కోర్టు 20 వరకు రిలీజ్ చేయొద్దంటూ ఆదేశించింది. ఈ కేసులో లియో సినిమా తెలుగు హక్కులు కొన్న నిర్మాత నాగ వంశీ చివర వరకు పోరాడినా.. ఫలితం లేకుండా పోయిందని తెలుస్తోంది. దీనిపై నాగవంశీ క్లారిటీ ఇస్తారని సమాచారం. ఈ నెల 20 వరకు సినిమా విడుదల చేయొద్దని కోర్టు తీర్పునివ్వడంతో తెలుగు ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.