Idream media
Idream media
కరోనా మహమ్మారి తీవ్రత దృష్ట్యా ప్రపంచ దేశాలతో పాటు పాకిస్థాన్‌లో కూడా లాక్‌డౌన్ అమలులో ఉంది. క్రీడాకారులందరూ ప్రజలతో పాటు ఇళ్లకే పరిమితమై కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇంట్లోనే బందీ అయిన షోయబ్ అక్తర్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడుతూ విరాట్ కోహ్లీని ఔట్ చేసే విధానంపై రెండు వ్యూహాలను అభిమానులతో పంచుకున్నాడు.
“ఒకవేళ నేను అతనికి బౌలింగ్ చేసే అవకాశం వస్తే ఆఫ్ స్టంప్ బయటికి వైడ్ రూపంలో బంతి విసిరి డ్రైవ్ ఆడేలా ఊరిస్తాను. అది వర్క్అవుట్ కాకపోతే గంటకి 150కిమీ వేగంతో బంతులని సంధించి ఔట్ చేస్తాను” అని అక్తర్ అభిప్రాయపడ్డాడు.గత న్యూజిలాండ్ సిరీస్‌లో భారత సారథి వరుసగా
ఆఫ్ స్టంప్‌కి వెలుపల పడిన బంతులను వెంటాడుతూ వికెట్ సమర్పించుకున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు వేగవంతమైన బంతులతో కూడా పరుగుల యంత్రం కోహ్లీని పెవిలియన్ బాట పట్టించవచ్చని బౌలర్లకు అక్తర్ సలహా ఇచ్చాడు.
భారత కెప్టెన్ కోహ్లీ వికెట్ పడగొట్టడంపై వ్యూహాలు వివరించిన తర్వాత ఆరోజులలో సచిన్ టెండూల్కర్‌ని తాను ఇబ్బంది పెట్టిన తీరు గురించి కూడా రావల్పిండి ఎక్స్‌ప్రెస్ వెల్లడించాడు. “ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లలో ఒకడైన సచిన్ టెండూల్కర్‌కి నేను బౌలింగ్ చేయగలిగాను. మా ఇద్దరి మధ్య పోరు అనగానే 2003 వన్డే ప్రపంచకప్‌లో సచిన్ కొట్టిన అప్పర్ కట్ సిక్సరే అందరికీ గుర్తొస్తుంది.కానీ నా బౌలింగ్‌లో సచిన్‌ని 12-13 సార్లు ఔట్ చేశాను’’ అని అక్తర్ నాటి జ్ఞాపకాలను గుర్తుచేశాడు.
వాస్తవంగా షోయబ్ అక్తర్ బౌలింగ్‌లో సచిన్ ఔట్ అయింది కేవలం 8 సార్లు మాత్రమే.అతడు వన్డేలలో 5 సార్లు,టెస్టులలో 3 సార్లు సచిన్‌ను ఔట్ చేశాడు.ఇక ఐపీఎల్-2008 సీజన్‌లో ఒకసారి క్రికెట్ గాడ్ తన వికెట్‌ను అక్తర్‌కు సమర్పించుకున్నాడు.20 దశకంలో భారత్,పాక్ మ్యాచ్ అంటే సచిన్,అక్తర్ మధ్య పోరుగా అభిమానులు భావించేవారు.దీంతో సచిన్ బ్యాట్,అక్తర్ బంతుల మధ్య ఆధిపత్యం కోసం రసవత్తరమైన పోటీ జరిగేది.