Idream media
Idream media
ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో భారత జట్టులో సంపాదించిన శివమ్ దూబే అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ ఆకట్టుకోలేకపోయాడు.భారత్,న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఏకంగా 34పరుగులు సమర్పించుకున్నాడు.దీంతో టీ20లలో స్టువర్ట్ బిన్నీ పేరిట ఉన్న చెత్త భారత బౌలర్ రికార్డును చెరిపి,ఆ చెత్త రికార్డును తన పేరున లిఖించుకున్నాడు.
దూబే చెత్త బౌలింగ్ రికార్డు:
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో పదో ఓవర్ శివం దూబే బౌలింగ్ చెయ్యగా తొలి రెండు బంతులను సీఫెర్ట్ భారీ సిక్సర్లుగా మలిచాడు.మూడో బంతిని బౌండరీకి తరలించి నాలుగో బంతికి ఒక్క పరుగు తీశాడు.ఐదో బంతిని దూబే నోబాల్ వెయ్యగా టేలర్ ఆ బంతికి బౌండరీ సాధించాడు.చివరి రెండు బంతులను రాస్ టేలర్ భారీ సిక్సులు కొట్టాడు.దీంతో శివమ్ దూబే ఒకే ఓవర్‌లో 34 పరుగులు సమర్పించుకొని అధిక పరుగులు ఇచ్చిన భారత బౌలర్ గా చెత్త రికార్డును నెలకొల్పి అపఖ్యాతి పాలయ్యాడు.
2016లో అమెరికా లాడర్‌హిల్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బిన్నీ ఏకంగా 32 పరుగులు ఇచ్చి తన పేర అతి చెత్త భారత బౌలర్ రికార్డును ఏర్పరచుకున్నాడు.నేటి మ్యాచ్ లో దూబే చెత్త బౌలింగ్ రికార్డుతో బిన్నీ చెత్త భారత బౌలర్ రెండో స్థానం లోకి నెట్టబడింది.2012లో జోహెన్నెస్‌బర్గ్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ సురేశ్ రైనా 26 పరుగులు సమర్పించుకుని తర్వాతి స్థానంలో నిలిచాడు.
అంతర్జాతీయ టీ20 లలో చెత్త బౌలర్ “బ్రాడ్”:
పొట్టి క్రికెట్ ఫార్మెట్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన రికార్డు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ పేరిట ఉంది.తొలిసారి 2007లో నిర్వహించిన టీ20 ప్రపంచకప్ లో భారత లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్, స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరుబంతుల్లో వరసగా ఆరు సిక్సర్లు బాది 36 పరుగులు చేయడంతో ఈ చెత్త రికార్డును తన పేరుపై లిఖించుకొని అంతర్జాతీయ చెత్త బౌలర్ గా అపకీర్తి మూటగట్టుకున్నాడు.