iDreamPost
android-app
ios-app

శివ కార్తికేయన్ ఓ ద్రోహి! ఇక సినిమాలు చేయను: మ్యూజిక్ డైరెక్టర్!

శివ కార్తికేయన్ ఓ ద్రోహి! ఇక సినిమాలు చేయను: మ్యూజిక్ డైరెక్టర్!

సినిమాకు హీరో హీరోయిన్లు, డైరెక్టర్లు ఎంత ముఖ్యమో.. అంతే కీలక పాత్ర పోషిస్తుంటారు మ్యూజిక్ డైరెక్టర్. ఒక సారి పాటలు హిట్టై.. మనస్సుకు హత్తుకుపోయే బీజీఎం ఇస్తే.. తిరిగి అదే మ్యూజిక్ డైరెక్టర్లను రిపీట్ చేస్తుంటారు హీరోలు, దర్శకులు. ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీ ఇదే సిస్టమ్‌ను కొనసాగిస్తుంది. అటువంటి కాంబోలో ఒకటి శివకార్తికేయన్-డి ఇమ్మాన్. కోలీవుడ్ లో వీరిద్దరూ కలిసి ఐదు సినిమాలకు పని చేశారు. సూపర్ డూపర్ సాంగ్స్ ను అందించి, సినిమా విజయంలో తన వంతు కృషి చేశాడు ఇమ్మాన్. మనం కోతి పరవై, వరుత్తపడతా వాలిబర్ సంఘమ్, రజనీ మురుగున్, సీమ రాజా, నమ్మ వీటు పిల్లై వంటి శివ కార్తికేయన్ సినిమాలకు మ్యూజిక్ అందించాడు ఇమ్మాన్. అయితే కొన్ని సంవత్సరాల నుండి వీరి కాంబోలో సినిమాలు రావడం లేదు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయన్న వార్తలు వినిపించాయి.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు ఇమ్మాన్. వారి మధ్య విభేదాలను ప్రస్తావించారు. శివకార్తికేయన్ తనను ద్రోహం చేశాడని ఇక అతనితో కలిసి పనిచేయనని చెప్పారు. వావ్ తమిళ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను, శివ మధ్య విభేదాలు రావడం నిజమేనని అంగీకరించిన ఇమ్మాన్.. ఇక ఈ జన్మలో అతనితో కలిసి పనిచేయనని చెప్పారు. అతడు తనకు నమ్మక ద్రోహం చేశాడని పేర్కొంటూ.. ఆ విషయాలు బయటకు చెప్పనని అన్నాడు. అసలు వీరి మధ్య మాటలు లేకపోవడానికి కారణాలు మాత్రం వెల్లడించలేదు. వచ్చే జన్మలో అవకాశం ఉంటే అప్పుడు చేస్తానంటూ చెప్పుకొచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్.. ఇంకా ఆ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే..?

‘ ఇతరులకు ద్రోహం చేయాలని ఎలా అనుకుంటారు. శివకార్తికేయన్ చేసిన ద్రోహం ఎప్పటికో తెలిసింది నాకు. ఏం జరిగిందో తెలుసుకునే సమయానికి, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే అతనితో కలిసి పని చేయను. అది మా ఇద్దరికే తెలుసు. ఈ విషయంపై మాటలు కూడా అయిపోయాయి. కానీ అతను ఏం అన్నాడో నేను బయటకు చెప్పలేను. ఆ విషయాలను నా పిల్లల కోసం దాచి పెట్టాలనుకుంటున్నాను. నా గురించి సమాజం తప్పుగా అనుకున్నా పట్టించుకోను. నేనేంటో నాకు తెలుసు. నా నిజాయితీ ఏంటనేది ఆ దేవుడికి, కుటుంబానికి తెలుసు. కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా జరుగుతాయి. నాకు అన్యాయం జరిగిందనడానికి శివకార్తికేయన్ మాత్రమే బాధ్యుడు అని అనడం లేదు. కానీ అతడే ముఖ్య కారణం. అతనితో, వారి కుటుంబంతో చాలా కాలంగా ఉన్నాను. కానీ అతడు చేసిన ద్రోహన్ని అంగీకరించలేకపోయాను’ అంటూ వ్యాఖ్యలుచేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తమిళ పరిశ్రమను షేక్ చేస్తున్నాయి.