Idream media
Idream media
బస్టాండ్ అంటే చిన్నచిన్న స్టాల్స్, మురికి వాసన, అరుపులు , కేకలు ఇది భారతదేశమంతా కనిపించే దృశ్యం. కానీ కర్నాటకలోని శివమొగ్గలో బస్టాండ్ ఒక మాల్‌లా ఉంటుంది. ఎస్కలేటర్స్, షాపింగ్ సెంటర్లు, శుభ్రంగా ఉండే రెస్టారెంట్. ముఖద్వారం చూస్తే ఇది బస్టాండా అనే అనుమానం వచ్చేలా ఉంది.
హైదరాబాద్ బస్టాండ్‌ని కూడా ఈ రకంగా మారిస్తే ఖచ్చితంగా లాభాదాయకమే. ఎందుకంటే లక్షల్లో జనం వచ్చే ప్రాంతం ఇది. హైదరాబాద్ కొంచెం మెరుగు గానీ, వైజాగ్ అయితే ఘోరం. రాజధాని అయితే ఏమైనా మారుతుందేమో చూడాలి.
కర్నాటకలో కూడా శివమొగ్గకే ఈ యోగం. మిగతా బస్టాండ్లు మరీ నాసిరకం. మన బస్టాండ్‌లలో కూర్చోడానికి కనీసం కుర్చీలైనా ఉన్నాయి. అక్కడ నల్లబండలే గతి. ప్రఖ్యాతిగాంచిన కృష్ణదేవాలయం ఉన్న ఉడుపి బస్టాండ్ , పూర్వకాలం ఉడుపి హోటల్‌లా గందరగోళంగా ఉంటుంది. అయితే బస్సు చార్జీల విషయంలో కర్నాటక ఆర్టీసీ సామాన్యుడికి చేరువలో ఉంది. ఇక్కడలాగా మోత లేదు.