iDreamPost
android-app
ios-app

రామ్ చరణ్ 15 క్రేజీ అప్డేట్స్

  • Published Jul 09, 2022 | 1:11 PM Updated Updated Jul 09, 2022 | 1:11 PM
  • Published Jul 09, 2022 | 1:11 PMUpdated Jul 09, 2022 | 1:11 PM
రామ్ చరణ్ 15 క్రేజీ అప్డేట్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోంది. పంజాబ్ నుంచి హైదరాబాద్ వచ్చిన టీమ్ ఇక్కడ పాట చిత్రీకరణని కంటిన్యూ చేయబోతున్నారు. వెయ్యి మంది డాన్సర్లతో ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద చూడని రేంజ్ లో దీన్ని పిక్చరైజ్ చేస్తున్నారని యూనిట్ నుంచి లీకవుతున్న సమాచారం.

ఇదొక్కటే కాదు సుమారు 1200 ఫైటర్లతో మరో టెర్రిఫిక్ యాక్షన్ బ్లాక్ ఒకటి డిజైన్ చేశారట. ఆర్ఆర్ఆర్ ఇంట్రోలా జనాన్ని గ్రాఫిక్స్ లో చూపించకుండా నిజంగానే అంత మందిని సెట్ చేస్తారు. దీని కోసమే శంకర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చరణ్ మూవీస్ అన్నిటిలోకి బెస్ట్ అనిపించే రేంజ్ లో ప్లాన్ చేశారని వినికిడి. డిసెంబర్ కంతా పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్లేలా షెడ్యూల్స్ సెట్ చేశారు.

తమన్ స్వరపరిచిన పాటలు కూడా ఓ రేంజ్ లో వస్తున్నాయట. చరణ్ తో తన కాంబోలో ఇప్పటిదాకా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ పడలేదు. హిట్లున్నాయి కానీ ఆ కొరత తీరేలా కంపోజింగ్ జరుగుతోందని యూనిట్ మాట. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్జె సూర్య విలన్ పాత్ర పోషిస్తున్నారు. చరణ్ ట్రిపుల్ రోల్ ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది కానీ అది నిజమో కాదో తెలియదు కానీ ద్విపాత్రాభినయం మాత్రం పక్కానే.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet