iDreamPost
android-app
ios-app

అశ్విన్ వెయ్యి వికెట్లు తీస్తాడంటున్న సీనియర్ స్పిన్నర్

  • Published Jan 28, 2022 | 7:08 AM Updated Updated Jan 28, 2022 | 7:08 AM
అశ్విన్ వెయ్యి వికెట్లు తీస్తాడంటున్న సీనియర్ స్పిన్నర్

అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో ఒక బౌలర్‌ వెయ్యి వికెట్లు సాధించడం ఇక కలేనా? ప్రస్తుతం తగ్గిపోతున్న టెస్టులు… క్రీడాకారుల ఫిట్‌నెస్‌ పరిగణలోకి తీసుకుంటే ఇది అసాధ్యమేనా? అంటే కాదంటున్నారు ప్రపంచ దిగ్గజ బౌలర్‌, స్పిన్‌ మాంత్రికుడు షేన్‌వార్నే. తన స్పిన్‌ మాయాజాలంతో అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదిచుకున్న వార్నే వెయ్యి వికెట్ల సమీపానికి వచ్చి నిలిచిపోయాడు. టెస్టుల్లో ఒక బౌలర్‌ వెయ్యి వికెట్లు తీయడం సాధ్యమేనని… భారత్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇది సాధించగలడని వార్నే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పడం వెయ్యి వికెట్లపై ఇప్పుడు చర్చ మొదలైంది. 

ప్రపంచ టెస్టు క్రికెట్‌ రంగంలో అత్యధిక వికెట్లు సాధించిన వ్యక్తి శ్రీలంకకు చెందిన ఆఫ్‌ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌. 800 వికెట్లు సాధించి నెంబరు వన్‌ స్థానంలో ఉన్నాడు. అతని తరువాత వార్నే 709 వికెట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. వీరిద్దరూ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. వెయ్యి వికెట్లకు సమీపంలోకి వచ్చినా వయస్సు రీత్యా తప్పుకున్నారు. మురళీధరన్‌ 133 టెస్టులు ఆడగా, వార్నే 145 టెస్టులు ఆడాడు. విచిత్రంగా ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే వైదొలగడం విశేషం.

వీరిద్దరి రిటైర్‌మెంట్‌ తరువాత వెయ్యి వికెట్లు అసాధ్యంగా మారింది. వీరి తరువాత స్థానంలో జిమ్మీ అండర్సన్‌ 640 వికెట్లతో (169 టెస్టులు) మూడవస్థానంలో ఉండగా అతని క్రీడా జీవితం ముగింపు దశకు వచ్చింది. ఇప్పుడు ఆడుతున్నవారిలో స్టూవర్ట్‌ బ్రాడ్‌ 537 వికెట్లతో (152) ఉన్నారు. బ్రాడ్‌ వయస్సు కూడా 35 సంవత్సరాలు కావడం వల్ల మహా అయితే వార్నే వరకు వెళ్లే అవకాశముంది తప్ప వెయ్యి వికెట్లు సాధించడం కష్టం. బ్రాడ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ కావడం వల్ల అతని కెరీర్‌ చాలా తొందరగా ముగియనుంది.

ఇప్పుడున్న మిగిలిన బౌలర్లలో స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, నాథన్‌ లియోన్‌లు ఉన్నారు. అశ్విన్‌ 430 వికెట్లు తీయగా, లియోన్‌ 415 వికెట్లు తీశారు. వీరిద్దరిలో అశ్విన్‌ వయస్సు 35 సంవత్సరాలు. అయినప్పటికీ స్పినర్‌ కావడం వల్ల మరో ఐదేళ్లకు పైగా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగే అవకాశముంది. అశ్విన్‌ ఫామ్‌లో ఉన్నాడు. కేవలం 84 టెస్టుల్లో 430 వికెట్లు తీయడం గమనార్హం. ఏవరేజ్‌ 24.38. ఒక టెస్టులో ఐదు వికెట్లు 16 సార్లు, పది వికెట్లు ఒకసారి తీశాడు. ఇదే ఫామ్‌లో కొనసాగితే అశ్విన్‌ కూడా అత్యధిక వికెట్లు తీసిన వార్నే, మురళీధరన్‌ను సునాయాశంగా చేరుకునే అవకాశముంది. అయితే వెయ్యి వికెట్లు తీయడమనేది కష్టమని క్రికెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రపంచ దిగ్గజ స్పినర్‌ వార్నే మాత్రం అశ్విన్‌ వెయ్యి వికెట్లు సాధించగలడని నమ్మకంగా చెబుతుండడం విశేషం.

Jojobet GirişBetcioivermectin tabletJojobet girişJojobet girişJojobetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Girişmarsbahis