iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్‌: మరో ఘోర రైలు ప్రమాదం.. చెల్లాచెదురుగా పడ్డ బోగీలు!

  • Published Jul 30, 2024 | 7:32 AM Updated Updated Jul 30, 2024 | 7:32 AM

Mumbai Howrah Express, Jharkhand, Chakradharpur: దేశంలో మరో రైలు ప్రమాదం సంభవించింది. ముంబై-హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఆ ఘటన గురించి వివరాలు ఇలా ఉన్నాయి...

  • Published Jul 30, 2024 | 7:32 AMUpdated Jul 30, 2024 | 7:32 AM
బ్రేకింగ్‌: మరో ఘోర రైలు ప్రమాదం.. చెల్లాచెదురుగా పడ్డ బోగీలు!

దేశంలో రైలు ప్రమాదాలు ఆగడం లేదు. కొన్నేళ్లుగా వరుస రైలు ప్రమాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వరుస రైలు ప్రమాదాలతో రైళ్లలో ప్రయాణించాలంటేనే జనం వణికిపోతున్నారు. ఈ క్రమంలోనే మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఝార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్‌ డివిజన్‌లో హౌరా-ముంబై రైలు పట్టాలు తప్పింది. మంగళవారం తెల్లవారుజామున జార్ఖండ్‌లోని సెరైకెలా-ఖర్సవాన్ జిల్లాలో ముంబై-హౌరా రైలు 10 బోగీలుపట్టాలు తప్పడంతో ఏడుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

సౌత్ ఈస్ట్ రైల్వేలోని చక్రదత్‌పూర్ డివిజన్ పరిధిలోని జంషెడ్‌పూర్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని బడాబాంబూ సమీపంలో తెల్లవారుజామున 3.45 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని మెరగైన వైద్య చికిత్స కోసం చక్రధర్‌పూర్‌కు తరలించారు. అయితే.. ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.