iDreamPost
android-app
ios-app

మీరు డైట్ లో రోజూ ఇది ఫాలో అవుతున్నారా? అయితే మీకు గుండె పోటు వచ్చే ఛాన్స్!

మీరు డైట్ లో రోజూ ఇది ఫాలో అవుతున్నారా? అయితే మీకు గుండె పోటు వచ్చే ఛాన్స్!

గత కొంత కాలం నుంచి ప్రపంచ వ్యాప్తంగా వరుస గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. ఇటు చిన్న పిల్లల నుంచి అటు వృద్ధుల వరకు హార్ట్ ఎటాక్ తో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ వరుస గుండెపోటు మరణాలను వింటూ ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. అయితే ఈ క్రమంలోనే కొందరు పరిశోధకులు గుండెపోటు మరణాలపై తాజాగా ఓ సంచలన రిపోర్ట్ ను ప్రకటించారు. ఇదే అంశం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకు ఆ రిపోర్ట్ ఏముంది? అందులో శాస్త్రవేత్తలు పొందుపరిచిన అంశాలు ఏంటనే పూర్తి వివరాలు మీకోసం.

వరుస గుండెపోటు మరణాల వేళ యూకే పరిశోధకులు తాజాగా ఓ రిపోర్ట్ లో కీలక విషయాలు తెలిపారు. రోజూ డైట్ లో భాగంగా చాలా మంది ఉప్పు ఎక్కువగా వాడుతుంటారు. అలాంటి వారికి ఖచ్చితంగా గుండెపోటు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ హార్ట్ ఎటాక్ మరణాలపై జాగ్రత్తగా ఉండాలంటే డైట్ లో ఇది ఫాలొ అవ్వాలని చెబుతున్నారు. అదేంటంటే? మీరు రోజూ తినే ఆహారంలో ఉప్పు ఎక్కువగా లేకుండా చూసుకోవాలని, మరో కీలక విషయం ఏంటంటే? ఉప్పు తగ్గించి తింటే 20 శాతం మేర గుండె సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయని కూడా పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా ఉప్పు తగ్గించి తింటే ఆర్ట్రియల్ ఫిబ్రిలేషన్ (గుండె దడ) తగ్గడమే కాకండా, గుండెపోటు మరణాలను సంభవించే ప్రమాదం ఉండదని తెలిపారు. ఇక సాధ్యమైనంత వరకు మీరు రోజూ తినే ఆహారంలో ఉప్పును ఎక్కువగా మోతాదులో లేకుండా చూసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి