Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని దూషించి, రాష్ట్రంలో అశాంతికి కారణమైన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను కోర్టులో హాజరుపరిచిన సమయంలో పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ పథకం ప్రకారం రాష్ట్రంలో అలజడులు రేకెత్తించాలనే లక్ష్యంతో పట్టాభిరామ్ సీఎంను ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేశారని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు. ఇదే మొదటి సారి కాదని.. గతంలోనూ ఇలాగే పట్టాభిరామ్ వ్యవహరించారని పేర్కొన్న పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేయకపోతే ప్రజలను మరింత భయబ్రాంతులకు గురి చేస్తాడని పేర్కొన్నారు. అందుకే పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు.. పట్టాభికి 14 రోజుల రిమాండ్‌ను విధించింది.
పట్టాభిని అరెస్టు చేయకపొతే వ్యాఖ్యల ద్వారా అతను ప్రజలను మరింత భయందోళనలకు గురిచేస్తాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ప్రజలను మరింత బెదిరించే అవకాశం ఉందన్నారు. ఫిర్యాదుదారుని, ఇతరులను బెదిరించి ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. రాజకీయ మైలేజీని పొందాలనే ఉద్దేశ్యంతో నేరాలను కొనసాగించవచ్చని పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.
Also Read : TDP Kommareddy Pattabhiram – జైలుకు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి
ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించడమే కాకుండా కులాలను, వర్గాలను ప్రేరేపించే అవకాశం ఉందని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ భయపెట్టే భాషను మరింతగా ఉపయోగించే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, ముఖ్యంగా పోలీసులకు చెడ్డపేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నట్టు ప్రాథమికంగా తెలిసిందన్నారు.
సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు కుట్ర పూరితమైనవిగా గుర్తించామని పోలీసులు తెలిపారు. అతను ఇప్పటికే ఇలాంటి 4 కేసుల్లో నిందితుడని ఆ వివరాలను రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. 1) Cr నం .6/2021 u/s 153-A, 505 (2) I టౌన్ PS, 2) Cr. నం. 86/2019 u/s 341, 143, 290, 188, 171-H r/w 149 IPC, 190 MV యాక్ట్ గవర్నర్ పేట్ PS(PT) , 3) Cr. నెం .87/2019 u/s 188, 286, 143, 149 గవర్నర్ పేట్ PS (PT), 4) Cr. నం .224/2020 u/s 3 EDA, 188 r/w 34 IPC సూర్యారావు పేట్ PS కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. సూర్యారావుపేట పోలీసు స్టేషనులో కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేశామని తెలిపారు.
ఈ కేసులు అతని రెచ్చగొట్టే ప్రసంగాలతో సమాజంలో అశాంతిని సృష్టించే స్వభావాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయన్నారు. అతను చేసిన వ్యాఖ్యలతో అవాంఛనీయ సంఘటనలు జరిగాయని తెలిపారు. ఇది పోలీసు అధికారిపై హత్యాయత్నం చేసే స్థాయికి వెళ్లిందని వివరించారు. వీటిని దృష్టిలో ఉంచుకుని నిందితుడిని అరెస్ట్ చేసామని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.
Also Read : Chandrababu Naidu – డామిట్ కథ అడ్డం తిరిగిందే?