iDreamPost
android-app
ios-app

వీరయ్య పాట – యండమూరి చంద్రబోస్ మాటకుమాట

  • Published Dec 30, 2022 | 6:48 PM Updated Updated Dec 30, 2022 | 6:48 PM
వీరయ్య పాట – యండమూరి చంద్రబోస్ మాటకుమాట

సినిమా పాటల సాహిత్యం గురించి చర్చలు అభ్యంతరాలు ఈనాటివి కాదు. కాకపోతే ఇవి ఏనాడూ మరీ సీరియస్ గా మారిన దాఖలాలు చాలా తక్కువ. ఇటీవలే విడుదలైన వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ కు సంబంధించి ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఇటీవలే తన ఫేస్ బుక్ లో అందులో ఉన్న పదాల గురించి గీత రచయిత సామర్ద్యాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా కొన్ని అంశాలు లేవనెత్తారు. అది ఆయన స్వయంగా రాసినది కాకపోయినా వేరొక సాహితీవేత్త చెప్పిన తప్పొప్పులని తన అకౌంట్ లో షేర్ చేసుకున్నారు. తిమిర నేత్రమై ఆవరించిన త్రినేత్రుడు అంటూ హీరో పాత్రను వర్ణిస్తూ అందులో కొన్ని పదాలు సాగాయి. దీని మీద చర్చ జరుగుతోంది.

పురాణాల మీద అవగహన లేకుండా చంద్రబోస్ ఇలాంటి పాటలు రాశారని తిమిరం అంటే అగాధమనే అర్థం వస్తుందని అంటే శివుడుకి చీకటి కన్ను ఉన్నట్టు ఇది దైవ దూషణేనని అందులో చెప్పుకొచ్చారు. యండమూరి దాన్ని సమర్ధిస్తూ సందేహమంటూనే అభిమానులకు షేర్ చేశారు. కామెంట్స్ లో వాదోపవాదాలు జరిగాయి. చంద్రబోస్ స్పందించారు. తాను రాసిన పాటలోని లైన్లు విరోధాబాసాలంకారం కిందకు వస్తాయని, ఇది రచయితలు అందరికీ తెలుసని, తనకు తెలిసే ఈ ప్రయోగం చేశానని వివరణ ఇచ్చారు. అసలు తిమిరంలోని నిగూఢఅర్థం తెలియని వారే అసలైన తిమిరమని కౌంటర్ కూడా ఇచ్చారు. మొత్తానికి మాటకు మాట గట్టిగానే ఉన్నాయి

ఇదేమీ మరీ తీవ్ర వివాదం కాకపోయినా సహజంగానే సినిమా పాటల్లో సృజనాత్మకత స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ హీరోల ఎలివేషన్లకు సంబంధించి ఈ మోతాదు ఇంకా హెచ్చు. అలాంటప్పుడు దాన్ని మరీ లోతుగా ఆలోచిస్తే ఇలాంటి చర్చలే వస్తాయి. దేవుడిని స్తుతిస్తూ రాసిన పాటలో లేదా ఏదైనా సామజిక ఉద్దేశం కోసం రచించిన గీతాలో అయితే ప్రశ్నించడం కరెక్టే కానీ ట్రెండ్ మారిపోయిన ఇప్పటి పరిస్థితుల్లో చంద్రబోస్ లాంటి ఒకరిద్దరు సీనియర్లు మాత్రమే అంతో ఇంతో అర్థం సాహిత్య విలువలు ఉన్న రచనలు చేస్తున్నారు. యండమూరి గారి ఉద్దేశం ఏమైనా మొత్తానికి ఎవరూ చూడని ఒక కోణమైతే పాటలో బయట పడింది