iDreamPost
android-app
ios-app

నిమ్మగడ్డ ప్రెస్‌మీట్‌.. వైసీపీపై కీలక వ్యాఖ్యలు..

నిమ్మగడ్డ ప్రెస్‌మీట్‌.. వైసీపీపై కీలక వ్యాఖ్యలు..

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఈ రోజు బుధవారం రాజకీయ పార్టీలతో సమావేశం అయిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. 18 పార్టీలకు ఆహ్వానం పంపగా.. 11 పార్టీలు సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలు చెప్పాయని నిమ్మగడ్డ తెలిపారు. మరో ఆరు పార్టీలు హాజరుకాలేదని, సమావేశానికి హాజరుకావడంలేదని వైసీపీ ముందుగానే తెలిపినట్లు నిమ్మగడ్డ పేర్కొన్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై వైసీపీ నాయకుడి ప్రెస్‌ నోట్‌ చూసి ఆశ్చర్యపోయానని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో గంటపాటు సమావేశం అయ్యానని తెలిపారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా ఉన్నతాధికారులతో చర్చలు జరిపామని చెప్పారు. కోవిడ్‌ పరిస్థితులపై వైద్యశాఖ అధికారులతో చర్చించామని చెప్పుకొచ్చారు. తాజాగా రాజకీయ పార్టీలతో జరిగిన సంప్రదింపుల ప్రక్రియను గొప్ప అంశంగా భావిస్తున్నామన్నారు. అన్ని విషయాల్లో కేంద్ర ఎన్నికల సంఘం అవలంభించే ఉత్తమ పద్ధతులనే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అనుసరిస్తుందన్నారు.