Idream media
Idream media
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పదవీకాలం పూర్తయింది. బుధవారంతో ఆయన సేవలు చాలిస్తున్నారు. పదవి నుంచి దిగిపోయే ముందు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలవాలని అపాయింట్‌మెంట్ కోరారు నిమ్మగడ్డ. అయితే, ఇందుకు గవర్నర్ తిరస్కరించినట్లు తెలిసింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేసిన నిమ్మగడ్డ.. అదే చేత్తో జెడ్పీటీసీ, ఎంపీటీపీ ఎన్నికలు నిర్వహించేసి వెళ్లవయ్యా కమిషనరూ.. అని ప్రభుత్వం సూచించింది.
అయితే టీడీపీ చావు దెబ్బ తినిందని, ఇక పాడె కట్టడమే తరువాయి అనే పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు డైరెక్షన్‌లో వాటిని నిర్వహించలేనని, తదుపరి కమిషనర్ ఆ బాధ్యత చూస్తారని చెప్పి నిమ్మగడ్డ జారుకున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై మాట్లాడాలి.. ఓసారి రాజ్ భవన్‌కు రా నిమ్మగడ్డా.. అని గవర్నర్ మార్చి 19న సమాచారం పంపితే, అందుకు పూర్తి నిర్లక్ష్యంతో నేను హైదరాబాద్‌లో ఉన్నా.. కలవడం కుదరదని తోలుమందం వైఖరి ప్రదర్శించారు రమేష్‌కుమార్. దీంతో గవర్నర్ నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఒక రాష్ట్ర ప్రథమ పౌరుడి మాటను లెక్కచేయని ఎస్‌ఈసీ దేశంలోనే ఎక్కడా లేకపోవచ్చు.
ఈ నేపథ్యంలోనే రిటైర్మెంట్ సందర్భంగా గవర్నర్‌ను కలిసి తన బాధలు, కష్టసుఖాలు, ఎన్నికల నిర్వహణలో ఏ తీరున వ్యవహరించిందీ.. వివరించాలనో ఏమో నాలుగు రోజుల కిందటే సార్.. మీ అపాయింట్‌మెంట్ ఇవ్వండి అంటూ గవర్నర్ ని కోరారు నిమ్మగడ్డ. అయితే రాజ్‌భవన్ నుంచి 30వ తేదీ సాయంత్రం వరకు రిప్లై రాకపోవడంతో నిమ్మగడ్డ తీవ్ర నిరాశకు లోనైనట్లు సమాచారం. ఇక చేసేది లేక 31వ తేదీ బుధవారం ఉద్యోగుల సమక్షంలో సాదాసీదాగా రిటైర్మెంట్ అవుతున్నారు నిమ్మగడ్డ. తర్వాత వారికి విందు ఏర్పాటు చేశారట. రిటైర్మెంట్ తంతు ముగిశాక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ముచ్చటిస్తారట నిమ్మగడ్డ. పాపం అలా ఆయన పదవీకాలం ఆఖర్లో అవమానకర రీతిలో ముగుస్తోంది.