Idream media
Idream media
శాసనసభ ను వదిలేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిత్యం ప్రజల్లోనూ, పార్టీలోనూ ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజల్లో గుర్తింపు కోసం, పార్టీని బలోపేతం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఓ పార్టీ అధినేతగా ఇంత వరకూ బాగానే ఉంది కానీ.. చేస్తున్న వ్యాఖ్యల్లో ముఖ్యమంత్రి జగన్‌పై అసహనం తప్పా.. ప్రజలకు మేలు చేయాలన్న తపన కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో.. ఆ పార్టీ అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో సమావేశంలోనూ బాబు తీరు అలానే ఉంది.
ఏంటీ వ్యాఖ్యలు..
ప్రతిపక్షం అన్నాక అధికార పక్షంపై విమర్శలు చేయడం సాధారణమే. చేస్తుండాలి కూడా. లేకుంటే ప్రభుత్వం ఏకపక్ష ధోరణిలో వెళ్లే ప్రమాదం ఉంటుంది. కానీ.. విమర్శల్లో పసలేకపోయినా, అధ్వానంగా ఉన్నా అది ప్రతిపక్షానికి మరింత చేటు చేస్తుంది. బాబు తాజా వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి. ‘కరోనాకు వ్యాక్సిన్ అయినా ఉంది. అది వస్తే ఎలాగైనా బతికి బట్టకట్టవచ్చు. జగన్ వైరస్‌కు వ్యాక్సిన్ లేదు. ఇది సోకితే నాశనమే.చిత్తుగా ఓడించి ఇంటికి పంపడం ఒక్కటే దీనికి మందు’ అని పేర్కొనడం దేనికి సంకేతమో ఆయనకే తెలియాలి.
అంతేకాదు.. విద్యారంగం పై బాబు ఆరోపణలు చేయడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే.. ఏపీలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసింది టీడీపీ ప్రభుత్వమైతే.. కార్పొరేటుకు ధీటుగా తీర్చి బలోపేతం చేసింది జగన్ సర్కారే. కానీ.. ‘ఏపీలో విద్యారంగం కుప్పకూలింది. ఒక్క టీచర్ నియామకమూ లేదు. ప్రాథమిక పాఠశాలలను హైస్కూళ్లలో విలీనం చేసి పేదలకు విద్య అందుబాటులో లేకుండా చేశారు. ముఖ్యమంత్రి పిల్లలు విదేశాల్లో చదువుకుంటారు. పేదల కోసం టీడీపీ విదేశీ విద్య పథకం పెడితే దానిని ఎత్తివేశారు. భాష పేరుతో ప్రయోగాలు చేసి విద్యా రంగాన్ని నాశనం చేస్తున్నారు.’’ అని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.