iDreamPost
android-app
ios-app

ఆర్మీలో శాశ్వత కమిషన్‌ హోదాలో మహిళలు – సుప్రీం తీర్పు

ఆర్మీలో శాశ్వత కమిషన్‌  హోదాలో మహిళలు – సుప్రీం తీర్పు

ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత గ్రాంట్ కమిషన్ హోదా కల్పించే విషయమై ఇన్నాళ్లూ మీనమేషాలు లెక్కిస్తున్న కేంద్రానికి సుప్రీం స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. పురుషులతో సమానంగా అన్ని అవకాశాలు కల్పించాలని తీర్పునిచ్చింది.

మహిళలకు పర్మినెంట్‌ గ్రాంట్‌ కమిషన్‌ హోదా కల్పించడంపై గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది. మహిళల సామర్థ్యంపై ప్రభుత్వం తన ఆలోచనా ధోరణి మార్చుకోవాలని.. కమాండ్‌ విధులకు మహిళా అధికారులు కూడా అర్హులేనని తేల్చి చెప్పింది. మహిళా అధికారులకు 3 నెలల్లో శాశ్వత కమిషన్‌ హోదా కల్పించాలని ఆదేశించింది. మహిళలకు శాశ్వత గ్రాంట్ కమిషన్‌పై 2010లో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. కమాండ్ హోదాలో మహిళలకు అవకాశం కల్పించడం కష్టసాధ్యమని సుప్రీం కోర్టుకు కేంద్రం విన్నవించింది. కొన్ని పోస్టుల్లో మహిళలను నియమించలేమని కేంద్రం చెప్పగా ఆ అభిప్రాయాలను సుప్రీం నిరాకరించింది.