iDreamPost
84 ఏళ్ల వరవరరావు ఏప్రిల్ 13న బాంబే హైకోర్టులో మొదట పిటీషన్ వేశారు. అనారోగ్య కారణాలతో తనకు బెయిల్ ఇప్పించాలన్న అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించిన తర్వాత, శాశ్వత బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
84 ఏళ్ల వరవరరావు ఏప్రిల్ 13న బాంబే హైకోర్టులో మొదట పిటీషన్ వేశారు. అనారోగ్య కారణాలతో తనకు బెయిల్ ఇప్పించాలన్న అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించిన తర్వాత, శాశ్వత బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
iDreamPost
2018 ఆగస్టు 28 నుండి ఎల్గార్ పరిషత్ కేసు( Elgar Parishad)లో అండర్ ట్రయల్‌గా ఉన్న విప్లవ కవి వరవరరావుకు, వైద్య కారణాలపై శాశ్వత బెయిల్ మంజూరు చేసింది.
84 ఏళ్ల వరవరరావు ఏప్రిల్ 13న బాంబే హైకోర్టులో మొదట పిటీషన్ వేశారు. అనారోగ్య కారణాలతో తనకు బెయిల్ ఇప్పించాలన్న అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించిన తర్వాత, శాశ్వత బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
మూడు నెలల్లో లొంగిపోవాలన్న హైకోర్టు విధించిన షరతును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
యు.యు. లలిత్, అనిరుద్ధ బోస్, సుధాన్షు ధులియా ల న్యాయమూర్తుల బెంచ్, వరవరరావు వయస్సు, అతని వైద్య పరిస్థితులు, కస్టడీలో గడిపిన రెండున్నర సంవత్సరాల కాలాన్ని పరిగణనలోకి తీసుకొని శాశ్వత బెయిల్ ను మంజూరు చేశారు.
“ఫిర్యాదుదారుని వైద్య పరిస్థితి కొంత కాలంగా మెరుగుపడలేదు, అంతకుముందు మంజూరు చేసిన బెయిల్ అవకాశాన్ని ఉపసంహరించుకున్నారు. అందుకే, మొత్తం పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, వైద్యపరమైన కారణాలపై బెయిల్ పొందేందుకు అర్హులు” అని బెంచ్ చెప్పిందని LiveLaw పేర్కొంది.
ఈ కేసులో ఛార్జిషీటు దాఖలు చేసినా, ఇంకా అభియోగాలు నమోదు కాలేదన్న వాస్తవాన్ని ధర్మాసనం గమనించిందనికూడా LiveLaw రిపోర్ట్ చేసింది.
ఈ కేసులో అరెస్టయిన 16 మందిలో, స్టాన్ స్వామి గతేడాది కస్టడీలో మరణించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే స్వామి చనిపోయారని అతని సన్నిహితులు ఆరోపిస్తున్నారు.
అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు ఎన్‌ఐఏ తరఫున హాజరైయ్యారు. నిందుతులు పదేపదే పిటీషన్లు వేయడంవల్లనే విచారణలో జాప్యం అవుతోందని, అందుకు వాళ్లనే నిందించాల్సి ఉందన్నారు. వరవరరావు పార్కిన్సన్స్ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉన్నదన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. వరవరరావు ఆరోగ్య పరిస్థితి “చాలా తీవ్రంగా లేదు” అని అన్నారు.
బెయిల్ కు వయస్సుతో సంబంధం లేదు
వరవరరావును విచారించడానికి ఇప్పటికే దర్యాప్తు అధికారికి “తగినంత అవకాశం” ఉందని విచారణ సందర్భంగా జస్టిస్ లలిత్ అన్నారు. దీనికి అదనపు సొలిసిటర్ విభేదించారు. అనారోగ్యంతో, అందులో చాలాకాలం వరవరరావు ఆసుపత్రిలోనే ఉన్నారని వాదించారు. అప్పుడే జస్టిస్ లలిత్ ఒక కామెంట్ చేశారు. వరవరరావు తన స్వేచ్ఛను దుర్వినియోగం చేశారన్నది ఎన్‌ఐఏ కేసు కాదని అన్నారు. అసలు విచారణ పూర్తిచేయడానికి ఎంతకాలం పడుతుందని సూటిగా జడ్జి అడిగితే, ఏడాదిన్నర పడుతుందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు చెప్పారు. అసలు కోర్టు నేరస్వభావాన్ని చూడాలికాని, వయస్సు కాదని ఆయన వాదించారు. ఈ సందర్భంగా UAPA ఆరోపణలను ఉదహరించారు. “నేరాల తీవ్రతకు వయస్సుతో సంబంధం లేదు. దయచేసి వరవరరావు ప్రవర్తన చూడండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్నాడని వాదించారు.
సుప్రీంకోర్టు తన తీర్పును ప్రకటించిన తర్వాత ఏఎస్‌జీ రాజు “తలనొప్పిగా ఉందని చాలా మంది బెయిల్ కోసం వస్తారు.” అని కామెంట్ చేశారు. ఇది విన్న న్యాయమూర్తుల బెంచ్ నవ్విందని LiveLaw రిపోర్ట్ చేసింది.
బెయిల్ షరతులలో భాగంగా, ముంబైలోని ప్రత్యేక NIA కోర్టు అనుమతి లేకుండా గ్రేటర్ ముంబై ఏరియాను విడిచిపెట్టకూడదని రావును దేశించారు. స్వేచ్ఛను ఏ విధంగానూ దుర్వినియోగం చేయకూడదు. సాక్షులెవరితోనూ మాట్లాడకూడదు. దర్యాప్తు ప్రక్రియను ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడదని కోర్టు పేర్కొంది.