iDreamPost
android-app
ios-app

టీడీపీకి రాజీనామా చేసిన పులివెందుల సతీష్‌రెడ్డి

టీడీపీకి రాజీనామా చేసిన పులివెందుల సతీష్‌రెడ్డి

ప్రతిపక్ష టీడీపీకి వైఎస్సార్‌ కడప జిల్లాలో గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందుల్లో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సతీష్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు.

గత కొద్దికాలంగా సతీష్‌రెడ్డి టీడీపీని వీడుతారనే ప్రచారం సాగుతోంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హాయం నుంచి గత ఎన్నికల వరకూ టీడీపీ తరఫున పులివెందులో సతీష్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్సీగా కూడా పని చేసిన సతీష్‌రెడ్డి మండలి డిప్యూటీ చైర్మన్‌గా కూడా పని చేశారు. పార్టీకి దాదాపు 30 ఏళ్లపాటు సేవలందించిన తనకు మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదనే అసంతృప్తితో ఉన్నారు. సతీష్‌రెడ్డిని కాదని ఈ సారి చంద్రబాబు బి.టెక్‌ రవికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.

Read Also : కడప టీడీపీ నేతల దారులన్నీ జగన్‌ ఇంటికే..!

ఇటీవల కార్యకర్తలో సమావేశం నిర్వహించిన సతీష్‌రెడ్డి పార్టీని వీడాలని ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్‌ ప్రయాణంపై త్వరలో తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. ఇన్నేళ్లు కష్టపడ్డా కూడా టీడీపీలో గుర్తింపు రాలేదని సతీష్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సతీష్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.