iDreamPost
iDreamPost
ఇంకా నెల రోజులు ఉండగానే సంక్రాంతి వేడి మాములుగా రాజుకోవడం లేదు. ఆల్రెడీ ప్రకటించిన వాటికే థియేటర్లు ఎలా సర్దాలో అర్థం కాక బయ్యర్లు తలలు పట్టుకుంటే వరసబెట్టి ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటిదాకా కన్ఫర్మ్ అయినవాటిలో మొదటిది జనవరి 11న రాబోతున్న అజిత్ తెగింపు. ప్రమోషన్లు చేయకపోయినా పోస్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తూ ఒకేసారి పబ్లిసిటీ పెంచబోతున్నారు. 12న బాలకృష్ణ వీరసింహారెడ్డి, విజయ్ వారసుడు నువ్వా నేనాని తలపడుతున్నాయి. మరుసటి రోజు 13న చిరంజీవి వాల్తేర్ వీరయ్యని లాక్ చేసి పెట్టారు. 14న చిన్న బడ్జెట్ మూవీ విద్యావాసుల అహం నిన్ననే పోస్టర్ తో నేనూ సిద్ధమంటూ అనౌన్స్ చేసింది
ఇక్కడిదాకా అయిదయ్యాయి. ఇప్పుడు ఆరో ఎంట్రీ వచ్చేసింది. సంతోష్ శోభన్ హీరోగా యువి కాన్సెప్ట్స్ తీసిన కళ్యాణం కమనీయంని జనవరి 14నే రిలీజ్ చేయబోతున్నట్టు ఇందాక అధికారికంగా చెప్పేశారు. నిజానికి ఇన్నేసి సినిమాల మధ్య ఇది నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. ఎంత యువికి థియేటర్లు చేతిలో ఉన్నా వాటిలో సినిమా వేయగలుగుతారు కానీ జనాన్ని అక్కడి దాకా రప్పించలేరుగా. ఒకపక్కా చిరు బాలయ్యల ఊర మాస్ బొమ్మలు కవ్విస్తుంటే వీటి వైపు ఎవరు తొంగి చూస్తారు. పోనీ ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారనుకున్నా ఏదో భీభత్సమైన బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే దాన్ని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. లేదంటే ఒకటి రెండు రోజులు తప్ప జనాల ఊసు ఉండదు
ఇదంతా బాగానే ఉంది కానీ ఇంతకీ దేనికి ఎన్ని స్క్రీన్లు దక్కనున్నాయోనని డిస్ట్రిబ్యూషన్ వర్గాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మైత్రి వాళ్ళు స్వంతంగా ఆఫీస్ పెట్టుకున్నాక పంపిణి విధానంలో పలు మార్పులు ఉంటాయని బయ్యర్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అసలు కేటాయింపులు ఎలా ఉంటాయోనన్నదే సస్పెన్స్ గా మారింది. వారసుడుకు సంబంధించిన రిలీజ్ ప్లాన్లో ప్రస్తుతానికి దిల్ రాజు ఎలాంటి మార్పులు చేసుకోలేదని వినికిడి. తెలుగు స్ట్రెయిట్ సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ క్రమంగా పెరుగుతున్న తరుణంలో ఆయన మనసు మార్చుకుంటారా ఇది వ్యాపారమంటూ తన పంథాలోనే వెళ్తారా వేచి చూడాలి. రిలీజుల పర్వం ఇక్కడితో ఆగితే బెటర్