Sankranthi: ఆ 18 గ్రామాల్లో సంక్రాంతి జరుపుకోరు..ఎందుకంటే?

భారతదేశంలో సంక్రాంతి అంటేనే అత్యంత పెద్ద పండుగా.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగ కళ ఉట్టిపడుతుంది. రాష్ట్రంలోని అందరూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్న తరుణంలో.. ఈ 18 గ్రామాల్లో మాత్రం సంక్రాంతి పండుగ నిషేధం అంట.

భారతదేశంలో సంక్రాంతి అంటేనే అత్యంత పెద్ద పండుగా.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగ కళ ఉట్టిపడుతుంది. రాష్ట్రంలోని అందరూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్న తరుణంలో.. ఈ 18 గ్రామాల్లో మాత్రం సంక్రాంతి పండుగ నిషేధం అంట.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సంక్రాంతి పండుగను.. అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా పల్లెటూళ్ళు ఇంటికి వచ్చిన అతిదులతో నిండిపోయి చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. తెలుగు వారి లోగిళ్ళలో ఈ సంక్రాంతి పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ చేసేవారికి ఈ పండుగ ఎంతో ప్రత్యేకమైనది. పంట చేతికి వచ్చాక జరుపుకునే మొదటి పండుగ సంక్రాంతి. అందుకే దీనిని వ్యవసాయ పండుగ అని పిలుస్తారు. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. అయితే, దేశమంతటా ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ పండుగ.. ఆ 18 గ్రామాల్లోని ప్రజలు మాత్రం అసలు జరుపుకోరట. పైగా ఈ సమయంలో ఆ ప్రాంతాల్లో ఈ పండుగ నిషేధం అంట. దానికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకుందాం.

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. ఈరోజునే మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. మొత్తం మూడు రోజుల పెద్ద పండుగ ఈ సంక్రాంతి. ఈ పండగ సమయంలో జరుపుకునే ప్రతీ వేడుకకు ఒక్కో విశిష్టత ఉంటుంది. భోగి మంటలు, లోగిళ్ళలో పెద్ద పెద్ద ముగ్గులు, హరిదాసు కీర్తనలు, బసవన్నల కోలాహలం, కమ్మటి పొంగలి, పిండివంటలు, గాలిపటాలు, కొత్త అల్లుళ్లు, కోళ్ల పందేలు ఇలా తెలుగు రాష్ట్రాల్లో పండుగ జరుపుకునే తీరు అందరిని ఎంతో ఆకట్టుకుంది. అందుకే చాలా మంది మిగిలిన రోజులల్లో ఎక్కడ ఉన్నా సరే.. సంక్రాంతికి మాత్రం వారి వారి సొంత ఊళ్లకు చేరిపోతుంటారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు ఈ సంక్రాంతి పండుగను ఇంకా బాగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. వేరే రాష్ట్రాలలో ఈ పండుగను ఇతర పేర్లతో ఘనంగా జరుపుకుంటారు. తమిళనాట ఈ పండుగను ‘పొంగల్ పండుగ’ పేరుతో జరుపుకుంటారు. ఇక్కడ ఈ పండుగను మొత్తం నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి పొంగల్‌, రెండవ రోజు సూర్య పొంగల్, మూడవ రోజు మట్టు పొంగల్, నాలుగవ రోజు కన్యా పంగల్ పేరిట జరుపుతారు. అంతే కాకుండా కొన్ని ప్రాంతాల్లో ‘జల్లికట్టు’ పందేలను కూడా నిర్వహిస్తారు.

ఇక రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలలో ‘పంతంగుల పండుగ’ గా జరుపుకుంటారు. భారీ సంఖ్యలో గాలిపటాలను ఎగురవేస్తారు. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో భోగి పండుగను ‘లోహ్రి’, మకర సంక్రాంతి ‘మాఘి’ పేరుతో జరుపుకుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మకర సంక్రాంతిని ‘ఖిచిడీ’ అని పిలుస్తారు. ఇలా దేశంలోని పలు ప్రాంతాలలో అనేక రకాల పేర్లతో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్న తరుణంలో.. అన్నమయ్య జిల్లాలోని టి.పసలవాండ్లపల్లె జీపీ పరిధిలోని 18 గ్రామాలూ మాత్రం ఈ పండుగను అసలు జరుపుకోవు. పైగా ఆ ప్రాంతాలలో ఈ పండుగ జరుపుకోవడం కూడా నిషేధం. దాని వెనుక ఓ చిన్న కథ దాగి ఉంది.

ఈ సంక్రాంతి పండుగ నిషేధం అనేది.. ఇది తరతరాలుగా అక్కడి ప్రజలు పాటిస్తున్న ఆచారం. మార్చి నెలలో జరిగే పల్లావలమ్మ జాతరనే ఇక్కడి ప్రజలకు సంక్రాంతిగా భావిస్తారట. గ్రామదేవత పల్లావలమ్మ ఆజ్ఞ ప్రకారం అప్పట్లో ఈ పండుగను పూర్వీకులు నిషేధించినట్టు గ్రామస్తులు నమ్ముతారు. ఇక ఆ నమ్మకమే ఇప్పటివరకు కొనసాగుతూ వస్తుంది. కాగా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే.. అమ్మవారి పేరు మీద కొందరు ఆవులను వదిలివేస్తారు. మార్చిలో అమ్మవారి జాతరకు వాటిని మాత్రమే అలంకరించి.. ఆలయం వద్దకు తీసుకెళ్లి అక్కడ పూజించడం వీరి ఆచారం. అందుకే ఈ 18 గ్రామాలలోని ప్రజలు సంక్రాంతి పండుగను జరుపుకోరు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments