iDreamPost
android-app
ios-app

సమంతా టాక్ షో రిపోర్ట్ ఏంటి

  • Published Nov 29, 2020 | 7:39 AM Updated Updated Nov 29, 2020 | 7:39 AM
సమంతా టాక్ షో రిపోర్ట్  ఏంటి

బిగ్ బాస్ 4 స్పెషల్ ఎపిసోడ్ కి యాంకరింగ్ చేయడం వల్ల వచ్చిన కాన్ఫిడెన్సో లేక ఆఫర్ బాగుంది తక్కువ టైంలో అయిపోతుందనే లాజిక్కో ఏమో కానీ సమంతా ఆహా యాప్ కోసం చేస్తున్న టాక్ షోకు మిశ్రమ స్పందన వస్తోంది. ఫస్ట్ ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండను తీసుకురావడం ప్రమోషన్ పరంగా బాగానే హెల్ప్ అయినప్పటికీ అందులో అన్ని తరహా ఎమోషన్స్ ఉండాలన్న ప్లాన్ తో ఏవేవో మిక్స్ చేయడంతో మొత్తానికే తేడా కొట్టింది. రెగ్యులర్ గా ఉంటే బాగుండదన్న లెక్క కాబోలు వెరైటీగా ఇలాంటి షోలలో గతంలో వాడేసిన టెంప్లేట్స్ అన్నీ వేసేసరికి అసలు వంటకం చెడిపోయింది. ఏమంత క్లిక్ కాలేకపోయింది.

అందుకే రెండో ఎపిసోడ్ కి జాగ్రత్త పడి ఎక్స్ ట్రాలు లేకుండా కేవలం టాక్ కు కట్టుబడి రానా, నాగ ఆశ్వన్ లను ఇంటర్వ్యూ చేసింది సామ్. ఇది ఒకరకంగా పర్వాలేదు అని చెప్పొచ్చు. రానా తన ఆరోగ్యానికి సంబంధించి ఎప్పుడూ షేర్ చేయని విషయాలు అందులో చెప్పడంతో అభిమానులకు బాగా కనెక్ట్ అయ్యింది. తన జబ్బు గురించి ఏ రోజూ ,మాట్లాడని రానా సమంతా షోలో ఓపెన్ అయ్యాడు. అయితే ఇలాంటివి టీవీ ఛానల్స్ లో ఎన్నో చూసిన ప్రేక్షకులు ప్రత్యేకంగా యాప్ ఓపెన్ చేసి మరీ చూస్తారా అంటే ఖచ్చితంగా ఔను అని చెప్పలేము కానీ సెలబ్రిటీల లిస్టు ఇంకా పెద్దదే ఉంది కాబట్టి ఇంకొంత కాలం వేచి చూడాలి.

అందరి కన్ను త్వరలో స్ట్రీమింగ్ కానున్న చిరంజీవి ఎపిసోడ్ మీదే ఉంది. షూట్ జరుగుతున్నప్పుడు తీసిన స్టిల్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మామూలుగానే తన టైమింగ్ తో ఆకట్టుకునే చిరు ఇప్పుడు సమంతాకు ఎలాంటి సమాధానాలు ఇచ్చి ఉంటారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. సామ్ ఇప్పటికైతే పది ఎపిసోడ్ల వరకే ఒప్పందం చేసుకుందట. వ్యూస్ ని బట్టి రెస్పాన్స్ ని విశ్లేషించుకుని దాన్ని బట్టి కంటిన్యూ చేయాలా వద్దా అనేది నిర్ణయించుకుంటారు. కేవలం సినిమాలు వెబ్ సిరీస్ లు కాకుండా ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ తో మార్కెట్ ని బలపరుచుకోవడానికి ఆహా పెద్ద ప్లాన్లే వేస్తోంది