iDreamPost
android-app
ios-app

సాలూరులో సత్తా చూపుతున్న రాజన్న దొర

సాలూరులో సత్తా చూపుతున్న రాజన్న దొర

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏదో తేడా జరిగి దెబ్బ తినేశాంగానీ ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో మాసత్తా చూపుతాం గ్రామీణ ఓటర్లు వేరు, పట్టణ ఓటర్లు వేరు.. చదువుకునోళ్లంతా మావైపే అంటూ తమాయించుకుని యుద్ధానికి బయల్దేరిన తెలుగుదేశం ఈసారి మున్సిపల్ ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేసే పరిస్థితి కనిపిస్తోంది.

వందలాది మున్సిపల్ వార్డులను ఎగరేసుకుపోయి, పదుల సంఖ్యలో మున్సిపాల్టీలను తన ఖాతాలో వేసుకున్న అధికార వైఎస్సార్సీపీ ఇప్పుడు అదే దూకుడు సాలూరు మున్సిపాలిటీలోనూ చూపుతోంది. విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాల్టీ ఎన్నికల్లో పోరాటానికి ముందే తెలుగుదేశం చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుండగా గెలుపు తథ్యం, చైర్మన్ పదవి నాకే దక్కాలి ఆన్నట్లుగా వైఎస్సార్సీపీ నాయకులు తమ ఎత్తులు తాము వేస్తున్నారు.

హ్యాట్రిక్ ఎమ్మెల్యే రాజన్నదొర వ్యూహాలు, మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, జిల్లా పార్టీ సమన్వయకర్త చిన్న శ్రీను
వ్యూహాల ముందు తెలుగుదేశం నిలువ లేని పరిస్థితి కనిపిస్తోంది. 29 వార్డులున్న ఈ మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయించారు. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో సాలూరు నియోజకవర్గంలో 80 శాతానికి పైగా సర్పంచులను తమ ఖాతాలో వేసుకున్న వైఎస్సార్సీపీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ తన జోరు కొనసాగించాలని భావిస్తున్నది. ప్రస్తుతం తమ నాయకుడు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల వంటి పాలనా సంస్కరణలు తమకు ప్రజామద్దతును సాధిస్తాయని వైఎస్సార్సీపీ అభ్యర్థులు విశ్వాసంతో ఉన్నారు.

Also Read:టీడీపీకి బెజవాడ తర్వాత విశాఖ తలనొప్పి!

దీనికితోడు పార్టీ నాయకత్వం నుంచి నిరంతర మార్గదర్శకత్వం కూడా క్యాడర్ ను అటు ఇటు చెదరకుండా చేస్తోంది. ఏదైనాగానీ గెలుపు తథ్యం అనుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్సార్సీపీలో ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. మొదటి నుంచి పార్టీలో ఉంటూ తమకంటూ ఓ గుర్తింపు, అధినాయకత్వం ఆశీస్సులున్న వారంతా తమ భార్యలు, బంధువులను బరిలోకి దించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి జరజాపు ఈశ్వశ్వరరావు ( 6 వార్డు నుంచి కుమార్తె నీలిమ) పువ్వల నాగేశ్వరరావు (18 వార్డు నుంచి భార్య ఈశ్వరమ్మ, జరజాపు సూరిబాబు (8 వ వార్డు నుంచి కోడలు దీప్తి), వంగపండు అప్పలనాయుడు వైసీపీ(7వ వార్డు భార్య)ను రంగంలోకి దించి వారి గెలుపు బాధ్యతలను తీసుకున్నారు.

టిడిపిలో గ్రూపుల గోల!!
వైఎస్సార్చీనీలో కూడా ఆశావహుల మధ్య పోటీ ఎక్కువగానే ఉన్నప్పటికీ వాటిని నియంత్రించేందుకు, నచ్చజెప్పేందుక ఓ పక్కా యంత్రాగం ఉంది. అయితే తెలుగుదేశంలో మాత్రం ఎవరికి వారే అన్నట్లుగా ఉంది. సాలూర్ మున్సిపాల్టీ లోను ఎవరి గ్రూపు వాళ్లదే అయి నడుస్తోంది. టీడీపీలోనూ మున్సిపల్ చైర్మన్ పదవికి పోటీ గట్టిగానే ఉంది. గొర్లె మధు (2 వ వాట్టులో భార్య విజయకుమారి), ప
ప్పల మోహన్ (2వ వార్డులో భార్య సత్యవతి), నిమ్మాజి తిరుపతిరావు( 27వ వార్డ్ లో భార్య శ్యామల)ను నిలబెట్టారు.

Also Read:పాపం డాక్టర్ గారు …గెలవగలిగినప్పుడు సీట్ రాలేదు,సీట్ వచ్చినప్పుడు పార్టీ ఓడిపోయింది..

ఇక్కడ నియోజకవర్గ ఇంచార్జీ,మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్ దేవ్, ఎమ్మెల్సీ సంధ్యారాణి ల మధ్య వర్గపోరు నడుస్తోంది. ఒకరికొకరు వెనుక నుంచి పోటు పొడిచేందుకు ఎవరికివారే ఎత్తులు వేస్తున్నారు. పార్టీ కస్తో కూస్తో బలంగా ఉన్న చోట కూడా రెండవ వర్గానికి చెందిన అభ్యర్థి నామినేషన్ వేసి పార్టీ ఆభ్యర్థి ఓటమికి బాటలు వేస్తున్నారు. వీళ్లను నియలత్రించేవాళ్లుగానీ, నర్దుబాటు చేయడం, నచ్చజెప్పడం వంటివి లేకుండా పోయాయి . దీంతో ఈ గ్రూపులగోల నడుమ వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపు సునాయానమేనని, ఇంకా పార్టీ మార్గదర్శకత్వం, సంక్షేమ పథకాలు తమను విజయతీరాలకు చేరుస్తాయని రూలింగ్ పార్టీ భావిస్తోంది.