iDreamPost
android-app
ios-app

Sajjala Request – బోసిడీకే అంటే బాగున్నారా..? అని అర్థమా..? ఢిల్లీ నేతలను ఇదే పదంతో సంబోధించండి బాబు

Sajjala Request – బోసిడీకే అంటే బాగున్నారా..? అని అర్థమా..? ఢిల్లీ నేతలను ఇదే పదంతో సంబోధించండి బాబు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఉద్దేశించి.. బోసిడీకే అంటూ పలుమార్లు దూషించిన విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు, ఆ పార్టీ అనుకూల పత్రికలతోపాటు ఈ రోజు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా యత్నిస్తున్నారు. బోసిడీకే అంటే.. ‘‘బాగున్నారా..?’’ అని అర్థమని ఢిల్లీలోని బాబు మిత్రులు చెప్పినట్లు టీడీపీ పత్రికలు రాసుకొచ్చాయి. ఆ పార్టీ ఎమ్మెల్యే, ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ కూడా.. బోసిడీకే అంటే బాగున్నారా..? అని అర్థమంటూ చెప్పుకొచ్చారు. తాజాగా దీక్ష విరమించిన సమయంలో మాట్లాడిన చంద్రబాబు కూడా బోసిడీకే అంటే ఏదో సినిమాలో విన్నానని, దాని అర్థం తెలియదని.. ఆ పదం తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు.

ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్యసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ నేతలు, చంద్రబాబు తీరును తనదైన శైలిలో ఎండగట్టారు. బోసిడీకే అంటే ‘‘ బాగున్నారా..?’’ అని అర్థాలు వివరిస్తున్న చంద్రబాబుకు సజ్జల ఓ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు.. అక్కడ కలిసే నేతల వద్ద ‘‘ బాగున్నారా..?’’ అనే మాటకు బదులు.. అదే అర్థం వస్తుందని చెబుతున్న ‘బోసిడీకే’ పదాన్ని వాడాలన్నారు. అక్కడ నేతలను కూడా ఇదే పదంలో సంబోధించి.. చొక్కా నలగకుండా బయటకు రావాలని కోరుతున్నామని పేర్కొన్నారు. బోసిడీకే పదం.. పసందైనదని ఢిల్లీ నేతలతో చెప్పించాలన్నారు. అదే జరిగితే తాము, తమ నేతలు చేసింది తప్పు అని ఒప్పుకుంటామన్నారు సజ్జల.

ఢిల్లీలోని వివిధ పార్టీల నేతలకు సజ్జల ఓ విన్నపం చేశారు. చంద్రబాబు కలిస్తే.. ఎందుకు వచ్చారో అడగాలని కోరారు. రాష్ట్రంలో ఏం చేశారో అడగాలన్నారు. రాజకీయాల్లో ఇలాంటి సంస్కృతి ఉండాలా..? రాజకీయాలంటే బూతులతో ఉండాలా..? సంస్కారహితంగా ఉండాలా..? అనేది అన్ని పార్టీలు తేల్చుకోవాలన్నారు. రేపు.. ఇతర పార్టీల నేతలను కూడా ఇలాగే తిట్టరని గ్యారెంటీ లేదన్నారు సజ్జల. ఉత్తరాధి బూతులు తిట్టి.. దాని అర్థం మాకు తెలియదని టీడీపీ నేతలు చెప్పవచ్చన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Also Read : Chandrababu Delhi Tour – బోసిడీకే అంటే అర్థం తెలియదన్న చంద్రబాబు.. మరి రాష్ట్రపతికి ఏమని ఫిర్యాదు చేస్తారు..?