iDreamPost
android-app
ios-app

సమ్మెతో కాదు..చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం – సజ్జల

సమ్మెతో కాదు..చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం – సజ్జల

ఉద్యోగ సంఘాలు చేస్తోన్న మూడు డిమాండ్లకు కాలం చెల్లింది అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఉద్యోగుల అకౌంట్లల్లో వేతనాలు పడ్డాయి అని ఆయన పేర్కొన్నారు. రెండు డిమాండ్లు నెరవేర్చడం సాధ్యపడదు అని స్పష్టం చేశారు. మిగిలిన డిమాండ్ అయిన పీఆర్సీ రిపోర్టు ఇవ్వడం వల్ల లాభంలేదని పట్టుబట్టే బదులు ప్రధాన సమస్యలపై చర్చలకు రావాలని అడిగాం అని పేర్కొన్నారు.

డిమాండ్లు తీర్చడానికి అవకాశం లేని పరిస్థితి ఇప్పుడు ఉందన్నారు సజ్జల. నిన్న సాయంత్రం ,ఇవాల ఉదయం ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడామని, ఉద్యోగ సంఘాలు అసలు సమస్యలపై మాట్లాడేందుకు రావాలని కోరాం అని పేర్కొన్నారు. కార్యాచరణ వాయుదా వేసుకోవాలని కోరామని తెలిపారు. ఇప్పటి వరకు నేతల నుంచి ఎలాంటి స్పందన రాలేదని రేపు ఉద్యోగులు చేసేది బలప్రదర్శనే అని వ్యాఖ్యానించారు. వైషమ్యం పెంచుకోవడం ద్వారా ఏం చేస్తారు..? అని ఆయన ప్రశ్నించారు.

ఆందోళనలో సంఘ విద్రోహశక్తులు చొరబడే ప్రమాదం ఉంది అని హెచ్చరించారు. ఆందోళనపై ఉద్యోగ సంఘాల నాయకులు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి అని సూచించారు. సీపీఎస్,అవుట్ సోర్సింగ్ ఒక పట్టాన తెగేవి కాదని స్పష్టం చేశారు. ఆర్టీసీ వారి సమస్యలు పరిష్కారానికీ చర్యలు తీసుకుంటుండగానే వారినీ తీసుకువచ్చారని ఆర్టీసీ ని ప్రభుత్వంలో కలిపినా ఆందోళన చేస్తామంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులపై అభిమానంతోనే విలీనం చేసిందని వివరించారు.

ఆర్టీసీ వారిని కూడా తీసుకు వచ్చి, బస్సులు ఆపి బల ప్రదర్శన చేయాలని చూస్తున్నారని అన్నారు. బలం పెంచుకునేందుకు ఆర్టీసీ వారినీ తీసుకొచ్చి ఆందోళన చేయిస్తున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రజల ఇబ్బంది తొలగించడం ప్రభుత్వం బాధ్యతన్నారు సజ్జల. ఉద్యోగులపై చర్యలు తీసుకునే పరిస్థితి కి తెచ్చుకోవద్దన్నారు. ఉద్యోగులకు ఏ విధంగా చూసినా వేతనం కచ్చితంగా పెరుగుతుందని సజ్జల చెప్పారు.

కోవిడ్ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెబుతున్నాం అన్నారు ఆయన. ఉద్యోగులు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తాం అని తెలిపారు. ఇప్పుడు వెలగపూడి నుంచే పరిపాలన సాగుతుందని పేర్కొన్నారు. టెక్నికల్ గా ప్రస్తుతం పాలన ఎక్కడి నుంచి జరుగుతుందో అదే ప్రస్తుత రాజధాని అవుతుంది అని అన్నారు. భవిష్యత్తులో రాజధాని మార్పు ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్రం బడ్జెట్ లో ఏటా రాష్ట్రానికి అన్యాయమే చేస్తున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్ లో ఈసారి కూడా రాష్ట్రానికి అన్యాయమే జరిగిందని ఆవేదన వ్యక్తం చేేశారు.

ఉద్యోగుల సమస్యల పై ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని చెప్పడం లేదని… మార్పులకు అవకాశం ఎప్పుడూ ఉంటుంది అన్నారు. చర్చలకు వచ్చి పరిష్కరించు కోవాలని ఉద్యోగులను కోరుతున్నామని తెలిపారు ఆయన. గతంలో తెదేపా .. భాజపా తో పార్ట్ నర్ గా ఉన్నా రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. జగన్ వల్లే ప్రత్యేక హోదా సజీవంగా ఉందని, రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్ వ్యాఖ్యల వల్ల పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవచ్చు అని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం కూడా ఉండొచ్చు…దీనిపై చర్చ జరగాలన్నారు.

Also Read : ఏపీ రాజధాని పై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే..తేల్చి చెప్పిన కేంద్రం