Idream media
Idream media
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేంద్ర చేతిలో తగిలిన ఊహించని దేబ్బో లేక మరేదైనా కారణం ఉందో గాని తెలంగాణా మంత్రులు నేడు కాస్త అనవసర వ్యాఖ్యలు చేసారు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు నేడు నిర్వహించిన ధర్నాలో భాగంగా ఏపీ ప్రభుత్వంపై నోరు జారడం పట్ల తీవ్ర చర్చ జరుగుతోంది. తెలంగాణా మంత్రులు చేసిన విమర్శల పట్ల ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సమాధానం ఇచ్చారు. కాసేపటి క్రితం సజ్జల మీడియాతో మాట్లాడుతూ…
కేంద్రం నుంచి రావాల్సింది రప్పించుకోవడం మా హక్కు అని కేసీఆర్ అన్నారని… నిధులు రాబట్టే విషయంలో మిగిలిన వారు కూడా అలాగే వ్యవహరిస్తారని స్పష్టం చేసారు. మేము బిచ్చమెత్తుకుంటున్నారని తెలంగాణ నేతలు మాట్లాడితే అది వారి విచక్షణకే వదిలేస్తున్నామన్నారు సజ్జల. బిచ్చ మెత్తుకుంటున్నారని తెలంగాణ నేతలు మాట్లాడటం వారి రాజకీయ అజ్ఞానం అవుతుందన్నారు. కేంద్రం నుంచి నిధులను రావాల్సిన పద్దతుల్లో రాబట్టుకుంటున్నామని వారు ఎలా పోవాలో వారు చూసుకోవాలి, మేము ఎలా పోతే వారికేమిటి..? అంటూ తన శైలిలో సజ్జల కౌంటర్ ఇచ్చారు.
వారి సమస్యల నుంచి తప్పించుకునేందుకే ఇలా మాట్లాడుతున్నారన్నారు. వారి సమస్యలనుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకే తెలంగాణ నేతలు ఇలా ఏపీ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు తెరాస కు ఏపీలో సీన్ లేదని హైదరాబాద్ మాత్రమే అన్నారు ఆయన. ఇక్కడ ప్రసెన్స్ లేని పార్టీ..ఇక్కడి వాటి గురించి కామెంట్ చేయడం సరైంది కాదు అని అన్నారు.
ఇక మంత్రి పేర్ని నానీ కూడా తెలంగాణా మంత్రులకు కౌంటర్ ఇచ్చారు. మా రాష్ట్ర అభివృద్ధి కోసం మాకు రావాల్సిన నిధుల విషయంలో మేము కేంద్రం వద్ద బిచ్చం ఎత్తుకుంటున్నామని మాటి మాటికి ఢిల్లీ వెళ్తున్న కేసీఆర్ ఏమి బిచ్చం ఎత్తుకోడానికి వెళ్తున్నాడు అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. మాటి మాటికి కేంద్ర క్యాబినేట్ లో చేరుతున్నాం.. రమ్మంటున్నారని ఎందుకు చెప్పుకుంటున్నారని ప్రశ్నించారు. బయట కాలర్ ఎగురవేసి.. లోపల కాళ్ళు పట్టుకునే అలవాటు జగన్ కి లేదన్నారు ఆయన. ఎవరితో అయినా స్నేహం అంటే స్నేహం.. డీ అంటే ఢీ జగన్ నైజం అని స్పష్టం చేసారు. తెలంగాణ ప్రభుత్వం దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి అంటున్నారు.. కాంట్రాక్టర్లకు ఎంత బకాయిలు ఇవ్వాలో అడగండని హితవు పలికారు. కేంద్ర మీద కోపం ఉంటే మా మీద పడి ఏడవడం ఎందుకని నిలదీశారు.
Also Read : Bjp Central Minister,Warns To Kcr -ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, కేసీఆర్ కు కేంద్రం వార్నింజరుగుతోంది