iDreamPost
android-app
ios-app

మెగా అల్లుళ్లు.. ఆన్ ది వే..!

  • Published Feb 01, 2018 | 5:36 AM Updated Updated Feb 01, 2018 | 5:36 AM
  • Published Feb 01, 2018 | 5:36 AMUpdated Feb 01, 2018 | 5:36 AM
మెగా అల్లుళ్లు.. ఆన్ ది వే..!

ఇప్ప‌టికే మెగా ఫ్యామిలీ నుంచి చిన్న‌సైజ్ క్రికెట్ టీంకు స‌రిపోయేంత మంది హీరోలున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇంత‌మంది హీరోలేంటి అనే విమ‌ర్శ‌లు కూడా బ‌య‌ట ఉన్నాయి. అయినా గానీ ఇప్ప‌టికీ వ‌స్తూనే ఉన్నారు. తాజాగా మ‌రో ఇద్ద‌రు హీరోలు మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చేస్తున్నారు. వాళ్ల‌కు కూడా కేరాఫ్ చిరంజీవే. మెగాస్టార్ చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ తొలి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ అంతా పూర్త‌యింది. సాయికొర్ర‌పాటి నిర్మాణంలో క‌ళ్యాణ్ తొలి సినిమా చేయ‌బోతున్నాడు. జ‌త‌క‌లిసే ఫేమ్ రాకేష్ శ‌శి తెర‌కెక్కించ‌బోయే ఈ చిత్రంలో ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం ఫేమ్ మాళ‌విక న‌య్య‌ర్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. తాజాగా ఈ చిత్ర ఓపెనింగ్ జ‌రిగింది. చిరంజీవి క్లాప్ కొట్టారు. రాజ‌మౌళి కూడా ఈ పూజా కార్య‌క్ర‌మానికి వ‌చ్చాడు. 

ఇక ఈయ‌న‌తో పాటు సాయిధ‌రంతేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ కూడా హీరో అవుతున్నాడు. విచిత్రం ఏంటంటే ఈయ‌న్ని కూడా సాయి కొర్రపాటే హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నాడు. ఈయ‌న నిర్మాణంలోనే ఇప్పుడు ఇద్ద‌రు మెగా అల్లుళ్లు ఇండ‌స్ట్రీకి రానున్నారు. త్వ‌ర‌లోనే ఈయ‌న సినిమాపై పూర్తి క్లారిటీ రానుంది. మెగా అల్లుడు అనే ఒక్క బ్రాండ్ చాలు.. క‌ళ్యాణ్ ఇండ‌స్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డానికి. ఇప్ప‌టికే కృష్ణ అల్లుడు సుధీర్ బాబు.. ర‌జినీ అల్లుడు ధ‌నుష్.. లాంటి హీరోలు సెటిలైపోయారు. ఇక ఇప్పుడు మెగా అల్లుడు కూడా వ‌స్తున్నాడు. ఈ విష‌యంలో చిరంజీవి కూడా అల్లుడికే స‌పోర్ట్ గా ఉన్నాడు. ఎంతైనా చిన్న‌ల్లుడు క‌దా.. ఆ మాత్రం ప్రేమ ఉంటుంది. పైగా చిన్న కూతురు అంటే చిరంజీవికి మ‌హా ఇష్టం. ఆమె అడిగితే చిరు అస్స‌లు కాద‌న‌లేడు. మెగా అల్లుడి బాక్సాఫీస్ గిల్లుడు రేంజ్ లో ఉంటుందో..?

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio