Idream media
Idream media
ప్రపంచాన్ని కరోనా వైరస్ భయాలు వెంటాడుతున్నాయి. సామాన్యుడు నుంచి దేశాలు ఏలే నేతల వరకూ అందరినీ కరోనా వైరస్ గజగజలాడిస్తోంది. ఇప్పటికే పలు దేశాలు ప్రధానులు, నేతలు సెల్ప్ క్వారంటైన్‌లోకి వెళ్లగా తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వియ నిర్బంధంలోకి వెళ్లారు.
ఇతర దేశాల కన్నా రష్యాలో కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉందనే చెప్పాలి. అయితే ముందు జాగ్రత్త చర్యలుగా కరోనాను ఎదుర్కొనేందుకు రష్యా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా ఎదుర్కొనేందుకు చేసిన ఏర్పాట్లను ప్రధాని పుతిన్ పరిశీలించారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం కరోనా వైరస్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఆస్పత్రిని పరిశీలించారు. సదరు ఆస్పత్రి ఛీఫ్‌తో కలిసి వార్డులు కలియతిరిగారు. తాగాజా సదరు ఛీఫ్ డాక్టర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో పుతిన్ అప్రమత్తమయ్యారు. తనకు తాను స్వియ నిర్బంధంలోకి వెళ్లారు. తరచూ కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకుంటున్నారని రష్యా అధికార వర్గాలు పేర్కొన్నాయి.
చైనా తర్వాత కరోనా వైరస్ యూరప్, అమెరికాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే కెనడా ప్రధాని భార్యకు కరోనా సోకింది. బ్రిటన్ ప్రధానికి కూడా పాజిటివ్ వచ్చింది. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. స్పెయిన్ యువరాణి మరియా థెరిసా కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 8,72,972 మందికి కరోనా వైరస్ సోకింది. 43,275 మంది ఈ మహమ్మరి వల్ల ప్రాణాలు కోల్పోయారు. 1, 84,594 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. అమెరికాలో అత్యధికంగా 1,88,639 మందికి కరోనా సోకింది. ఇటలీలో అత్యధికంగా 12,426 మంది మరణించారు. కోలుకున్న వారి సంఖ్య చైనాలో ఎక్కువగా ఉంది. వైరస్ వెలుగులోకి వచ్చిన చైనాలో ఇప్పటి వరకూ 76,238 మంది ఈ మహమ్మరి బారి నుంచి తప్పించుకున్నారు.