iDreamPost
android-app
ios-app

వీడియో: ఆరు నెలల బిడ్డతో మంత్రి పాదాలపై RTC డ్రైవర్..

వీడియో: ఆరు నెలల బిడ్డతో మంత్రి పాదాలపై RTC డ్రైవర్..

మనకు ఏదైనా  సమస్యలు వచ్చినప్పుడు అధికారులు, పోలీసుల వద్దకు వెళ్తాము. అంతేకాక పలు సందర్భాల్లో ప్రజా ప్రతినిధుల వద్దకు వెళ్లి.. తమ సమస్యలను విన్నవించుకుంటాము. కాళ్లు అరిగేలా తిరిగిన సమస్యలు పరిష్కారం కావు. దీంతో కొందరు.. ప్రజాప్రతినిధులు సభలు జరుగుతున్నప్పుడు సెక్యూరిటిని దాటుకుని వెళ్లి..మరీ వారిని కలుస్తుంటారు. దీంతో మీడియా దృష్టిలో పడటంతో.. మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందిస్తుంటారు. కొన్ని ఘటనలు మనస్సులను కదిలించేలా ఉంటాయి. తాజాగా ఆరు నెలల బిడ్డతో మంత్రి పాదాలపై ఆర్టీసీ డ్రైవర్ పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బుధవారం తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో రవాణ శాఖ మంత్రి శివశంకర్ పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి  హాజరయ్యారు. ఇందులో కొత్త భవనాల ప్రారంభోత్సవం, కారుణ్య నియామక ఉత్తర్వులు, పది, ప్లస్-2 తరగతుల్లో రాణించిన రవాణా శాఖ కార్మికుల పిల్లలకు సత్కారం జరిగింది. ఈ సందర్భంగా ఓ ఆర్టీసీ డ్రైవర్ హఠాత్తుగా స్టేజిపైకి వెళ్లాడు. తన ఆరు నెలల బిడ్డను మంత్రి పాదాల వద్ద ఉంచాడు.  ఆ ఉద్యోగి చేసిన పనికి మంత్రితో సహా అక్కడి వారు షాక్ కు గురయ్యారు. తన సమస్యను మంత్రికి వివరించాడు.

తాను కోయంబత్తూరులో ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తూ ఉన్నట్లు తెలిపాడు. ఇటీవల తన భార్య బిడ్డకు జన్మనిచ్చి మరణించిదని కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలను  ఉద్యోగం చేస్తూ చూసుకోలేకపోతున్నానని, స్వగ్రామం తేనిలో ఉన్న తన తల్లికి అప్పగించాలని పేర్కొన్నాడు. తన బిడ్డలను చూసుకునేందుకు కోయంబత్తూరు నుంచి తేనికి బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. అతడి విజ్ఞప్తిని స్వీకరించి మంత్రి.. పరిశీలంచి చర్యలు తీసుకంటానని  హామిఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి:  మహిళపై పోలీసుల అరాచకం.. వైరల్​గా మారిన వీడియో!