వీడియో: 2 రూపాయలకే ఐస్ క్రీమ్.. ఎగబడిన జనం!

వీడియో: 2 రూపాయలకే  ఐస్ క్రీమ్.. ఎగబడిన జనం!

ఐస్ క్రీమ్ అంటే పిల్లలకు ఎంతో ఇష్టం. అందుకే ఎక్కడ ఐస్ బండి, షాప్ కనిపించినా ఐస్ క్రీమ్ కావాలని మారం చేస్తుంటారు. ఇంకా కొందరు పిల్లలు అయితే  రోజూ ఇంట్లో ఐస్ క్రీమ్ కోసం అల్లరి చేస్తుంటారు. వారి గోలను తట్టుకోలేక తల్లిదండ్రులు షాపు నుంచి తీసుకొచ్చి ఇస్తారు. ఇదే సమయంలో ఐస్ క్రీమ్  ధరల దెబ్బకు సామాన్యుడి జేబులకు చిల్లు పడుతుంది. ఐస్ క్రీమ్ లోని ప్లేవర్స్ ను బట్టి ధరలు ఆకాశంలో ఉంటాయి. అయితే ఒక చోట మాత్రం ఐస్ క్రీమ్ ను కేవలం రూ.2 కే అందిస్తున్నాడు. దీంతో అక్కడికి జనాలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది.

ఐస్ క్రీమ్ అంటే చిన్నపిల్లల  నుంచి పండు ముసలి వారి వరకు అందరూ ఐస్ క్రీమ్ అంటే ప్రాణం ఇస్తారు. మరికొందరు అయితే జోరు వానలో కూడా ఐస్ క్రీమ్ తింటారు. ఇంకా చాలా మంది హోటల్ కి వెళ్లి భోజనం చేసిన తరువాత ఐస్ క్రీమ్ తినకపోతే సంతృప్తి ఉండదు. అలాంటి ఐస్ క్రీమ్ ను తమిళనాడులోని ఓ ప్రాంతంలో కేవలం రూ.2 కే ఇస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని శివకాశీ ప్రాంతంలో నమూస్ అనే ఓ ఐస్ క్రీమ్ దుకాణం వాళ్లు కేవలం రెండు రూపాయలకే ఐస్ క్రీమ్ అందిస్తున్నారు. అదే విషయాన్ని షాపు బయట బోర్డు పెట్టారు.

దీంతో చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ల  వరకు అందరూ షాపుకి క్యూ కట్టారు. లైన్ లో నిల్చోని మరి.. ఐస్ క్రీమ్ తిన్నారు. శివకాశీ పట్టణంలోని జనాలందరూ ఈ దుకాణం ముందే వాలిపోయారు.  అంతేకాక షాపు వాళ్లు కూడా వచ్చిన వినియోదారులకు లేదనకుండా భారీగానే ఐస్ క్రీమ్ అందించారు. రెండు రూపాయలకే ఐస్ క్రీమ్ కావడంతో ఒక్కొక్కరు పదుల సంఖ్యలో తీసుకుని తిన్నారు.  ఆడ, మగ, ముసలి ముతక అనే తేడాలేకుండా అందరూ వచ్చి.. కడుపు నిండా ఐస్ క్రీమ్ ను ఆరగించారు. మరికొందరు అయితే ఇలాంటి అవకాశం మళ్లీ దొరకదని చిన్నపాటి బక్కెట్ లో ఐస్ క్రీమ్ లను నింపుకుని వెళ్లారు.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ షాపు వాళ్లు చేసిన పనిని కొందరు పిచ్చి అంటూంటే.. వ్యాపారంలో ఇదోక టెక్నిక్ అని మరికొందరు అభిప్రాయ పడ్డారు.  తొలుత తక్కువ ధరతో కస్టమర్లను ఆకట్టుకుని ఆ తరువాత .. అదే నాణ్యతతో కాస్తా ధరలు పెంచుకుంటారని కొందరు మార్కెటింగ్ నిపుణులు అభిప్రాయా పడ్డారు. ఏది ఏమైనా.. వీళ్లు ఈ షాపు వాళ్లు ఇచ్చిన ఝలక్ కి మిగిలిన షాపు వాళ్లు అవాక్కవుతున్నారు. మరి.. వైరల్ అవుతోన్న ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments