యాదృశ్చికమో, కాకతాలియమో.. కొన్ని సంఘటనలు జరగడం చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేయకమానదు. ఇలాంటి సంఘటనలకు వరల్డ్ కప్ 2023 వేదికగా మారింది. మెున్నటికిమెున్న విశ్వవిజేత ఇంగ్లాండ్ కు షాకిచ్చింది పసికూన ఆఫ్గాన్ జట్టు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది ఇంగ్లాండ్ మాజీ ఆటగాడే కావడం విశేషం. జోనాథన్ ట్రాట్.. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు ఇప్పుడు వరల్డ్ కప్ లో పాల్గొంటున్న ఆఫ్ఘాన్ టీమ్ కు హెడ్ కోచ్. ఈ విజయంలో అతడి పాత్రను తీసిపారేయలేం. ఇక ఇలాంటి పాత్రే నెదర్లాండ్స్ విజయంలో పోషించాడు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు. అవును సౌతాఫ్రికా ఓటమికి ప్రధాన కారణం సఫారీ జట్టు మాజీ ఆటగాడు. మరి ఆ ప్లేయర్ ఎవరో? ఇప్పుడు తెలుసుకుందాం.
వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదు అయ్యింది. సూపర్ ఫామ్ లో ఉన్న సౌతాఫ్రికా టీమ్ కు గట్టి షాకిచ్చింది పసికూన నెదర్లాండ్స్. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో అసాధారణ ప్రతిభ కనబరిచిన డచ్ టీమ్ 38 పరుగుల తేడాతో విజయం సాధించంది. ఇదిలా ఉండగా సఫారీ టీమ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆ జట్టు మాజీ ఆటగాడే. అయితే ఈసారి ఆఫ్ఘాన్ జట్టు కోచ్ లా కాకుండా.. ఇతడు డైరెక్ట్ గా ప్లేయర్ కావడం గమనార్హం. మరి ఇంతకీ దక్షిణాఫ్రికా ఓటమిని శాసించిన సొంత టీమ్ మెట్ ఎవరో కాదు.. రోలొఫ్ వాండర్ మోర్వ్. క్రికెట్ ప్రారంభించిన తొలినాళ్లలో సౌతాఫ్రికాలోని టైటాన్స్ ప్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత తన ఆటతీరుతో సఫారీ జట్టుకు ఎంపిక అయ్యాడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల కారణంగా అతడు సౌతాఫ్రికా వదిలి నెదర్లాండ్స్ టీమ్ కి వచ్చేశాడు.
గత కొంతకాలం డచ్ టీమ్ లో ఆడుతూ.. టీమ్ లో కీలక సభ్యుడిగా ఎదిగాడు. ఇటు బౌలింగ్ అటు బ్యాటింగ్ లో సత్తా చాటగల సమర్థుడు వాండర్ మోర్వ్. తాజా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో తన ఆల్ రౌండ్ షోతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో తాను ఇదివరకు ప్రాతినిథ్యం వహించిన జట్టు ఓటమికి కారణం అయ్యాడు. ఈ మ్యాచ్ లో వాండర్ మోర్వ్ 19 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, ఓ సిక్స్ తో 29 పరుగులు చేశాడు. డచ్ టీమ్ 245 స్కోర్ చేసిందంటే దానికి ఒన్ ఆఫ్ ద రీజన్ ఇతడే అని చెప్పొచ్చు. ఇక బౌలింగ్ లో కూడా సత్తా చాటాడు. పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న సఫారీ టీమ్ లో కెప్టెన్ బవుమాతో పాటుగా వాండర్ డస్సెన్ లాంటి కీలక బ్యాటర్ల వికెట్లను పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో 9 ఓవర్లు వేసి 3.80 ఎకానమీతో కేవలం 34 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మరి తన అద్భుతమైన ఆటతీరుతో సఫారీ జట్టు ఓటమికి కారణమైన వాండర్ మోర్వ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Roelof Van Der Merwe, South African born, 38-year-old:
– 29(19) with bat.
– 2 wickets for 34 runs with ball.What a performance, the fighter, he gives 110% in the field for the team. pic.twitter.com/dw98klFZGh
— Johns. (@CricCrazyJohns) October 17, 2023