Krishna Kowshik
దేశంలో అనారోగ్యాల బారిన పడిన వారితో పోలిస్తే.. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువ ఉంటుందనేది చేదు వాస్తవం. రెప్పపాటులో జరిగే ఈ ప్రమాదాల కారణంగా అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు. కుటుంబాలకు కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి
దేశంలో అనారోగ్యాల బారిన పడిన వారితో పోలిస్తే.. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువ ఉంటుందనేది చేదు వాస్తవం. రెప్పపాటులో జరిగే ఈ ప్రమాదాల కారణంగా అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు. కుటుంబాలకు కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి
Krishna Kowshik
రహదారులు రక్తమోడుతున్నాయి. దేశంలో ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, ర్యాష్ డ్రైవింగ్ వంటి కారణాలు ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి. గురువారం ఉదయం కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 13 మంది మృత్యువాత పడ్డారు. బాగేపల్లి వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి టాటా సుమో బలంగా ఢీకొట్టడంతో ఈ పెను విషాదం నెలకొంది. ప్రమాదానికి గురైన వాహనం ఏపీ రిజిస్ట్రేషన్‌తో ఉందని, మృతులంతా ఆంధ్రా వాసులని పోలీసులు గుర్తించారు. వీరంతా చిక్కబళ్లాపూర్ వెళుతున్నట్లు పేర్కొన్నారు.
ప్రమాదానికి గురైన టాటా సుమోలో మొత్తం 18 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారుగా నిర్ధారించారు. వీరంతా కూలీలని తెలుస్తోంది. బాగేపల్లికి సమీపంలో జాతీయ రహదాది 44పై ఆగి ఉన్న లారీని టాటా సుమో వెనుక నుండి గుద్దినట్లు పేర్కొన్నారు. దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో డ్రైవర్ లారీని గమనించలేకపోయాడని అన్నారు. బెంగళూరులో కూలీలుగా పనిచేస్తున్న వీరు.. దసరా పండుగ నిమిత్తం స్వస్థలానికి వచ్చి.. తిరిగి వెళుతుండగా.. ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. స్పాట్ లోనే ఏడుగురు చనిపోగా.. చికిత్స పొందుతూ మరో ఆరుగురు మరణించారు. కొందరికి గాయాలవ్వగా.. చికిత్స అందిస్తున్నారు.