iDreamPost
android-app
ios-app

వందకొట్టిన పంత్‌..!

వందకొట్టిన  పంత్‌..!

భారత్‌ – ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌లో భారత వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ సెంచరీతో కదంతొక్కాడు. ఈ సెంచరీతో పంత్‌ టెస్టుల్లో 3వ సెంచరీని నమోదు చేసుకోగా స్వదేశంలో అతనికి ఇది మొదటి సెంచరీ కావడం విశేషం. ఇన్సింగ్స్‌ 84వ ఓవర్‌లో రూట్‌ వేసిన మొదటి బంతినే భారీ సిక్స్‌గా మలిచి పంత్‌ సెంచరీ సాధించాడు. బరిలోకి దిగిన ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శిస్తూ వచ్చిన పంత్‌ 117 బంతుల్లోనే 13 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. ఇది పంత్‌కు స్వదేశంలో తొలి సెంచరీ కావడం విశేషం. శతకం బాదిన తర్వాతి ఓవర్లలోనే అండర్సన్‌ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్‌ ఇచ్చి పంత్‌ వెనుదిరిగాడు. దీంతో తొలి ఇన్సింగ్స్‌లో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసి 54 పరుగుల ఆధిక్యంలో నిలిచింది..

ఆరంభంలోనే ఎదురుదెబ్బ

ఇంగ్లాండ్‌ తొలి ఇన్సింగ్స్‌లో 205కు ఆలౌట్‌ కాగా బుధవారం ఆటను ఆరంభించిన టీమిండియా ఆదిలోనే శుభమన్‌గిల్‌ (0) వికెట్‌ను కోల్పోయింది. నైట్‌ వాచ్‌మెన్‌లుగా చతేశ్వరపూజారా, విరాట్‌కోహ్లీ గురువారం బరిలోకి దిగారు. జాక్‌లిచ్‌ వేసిన 24వ ఓవర్‌ ఆఖరిబంతికి చతేశ్వరపూజారా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీనిపై రివ్యూకూ వెళ్లినా ఫలితం లేకపోయింది.. ఆ తర్వాత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా స్వల్పవ్యవధిలోనే వెనుదిరిగాడు. స్టోక్స్‌ వేసిన 26వ ఓవర్‌ నాలుగో బంతిని కోహ్లి ఫ్లిక్‌ చేయగా.. బంతి బ్యాట్‌ ఎడ్జ్‌కి తాకి కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ చేతిలో పడింది.

దీంతో రహానే ఆచితూచి ఆడడం ఆరంభించగా, దానికి తగినట్లుగానే ఇంగ్లండ్‌ బౌలర్లు కూడా మరింత కట్టుదిట్టమైన బంతులను సంధించారు. దీంతో భారత్‌ ఇన్నింగ్స్‌ నత్తనడకన సాగింది. పుజారా అవుటయ్యాకా క్రీజులోకి వచ్చిన రహానే మంచి టచ్‌లో కనిపించాడు. రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నించాడు. ఇద్దరి మధ్య 39 పరుగుల భాగస్వామ్యం ఏర్పడిన అనంతరం రహానే ఇన్నింగ్స్‌ 37వ ఓవర్‌ 5వ బంతికి అండర్సన్‌ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 80 పరుగులతో లంచ్‌ విరామానికి వెళ్లింది.

పంత్‌ దూకుడు..

హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ 49 పరుగుల వద్ద ఔటై ఒక్క పరుగుతో అర్థ శతకం మిస్సయ్యాడు. రోహిత్‌ అవుట్‌తో 121 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. ఆ తర్వాత టీ విరామానికి ముందు అశ్విన్‌ 13 పరుగులు చేసి జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో ఓలీ పోప్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో వాషింగ్‌టన్‌ సుందర్‌తో కలిసి జతకట్టిన పంత్‌ దూకుడైన ఇన్నింగ్స్‌ ఆడడంతో టీమిండియా ఆధిక్యంలోకి వచ్చింది. తొలి 82 బంతుల్లో 50 పరుగులు చేసిన పంత్‌ అప్పటి వరకూ ఆచితూచి ఆడాడు. ఆ తర్వాత దూకుడు పెంచాడు. దీంతో భారత్‌ స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. 115 బంతుల్లోనే శతకం బాదాడు. బెన్‌స్టోక్‌, అండర్సన్‌ చేతికి కొత్త బంతి వచ్చిన తర్వాత కళ్లు చెదిరే షాట్లతో ఆకట్టుకున్నాడు. శతకం బాదిన తర్వాత అయితే 84.1 ఓవర్‌లో అండర్సన్‌ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అతను వాషింగ్టన్‌ సుందర్‌తో కలిసి 113 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో తొలిఇన్సింగ్స్‌లో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసి 54 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

మొదటి రోజు ఆటలో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 75.5 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైంది. స్టోక్స్‌ (55 రన్స్,6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. లారెన్స్‌ 46 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అక్షర్‌ పటేల్‌కు 4, అశ్విన్‌కు 3 వికెట్లు, సిరాజ్‌కు 2 వికెట్లు దక్కాయి.