iDreamPost
iDreamPost
ఆంధ్ర ప్రదేశ్ లో కర్మాగారాలు, ఫ్యాక్టరీలలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పనకు సంబంధించిన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ప్రయివేటు, పిపిపి, జాయెంట్ వెంచర్ తదితర అన్ని రకాల కంపెనీల్లో ఈ నిబంధన ప్రకారం ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంటుంది. సాంకేతికత, అత్యంత నైపుణ్యం, నైపుణ్యం, నైపుణ్యం లేని.. అన్ని రకాల కేటగిరిల్లో పోస్టులు భర్తీ చేయాలి. జనవరి నుంచి మూడు త్రైమాషీకాల్లో నియామకాలు చేపట్టాలి. ఇందుకోసం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నోడెల్ ఏజెన్సీ ఉంటుంది.
స్థానికత గుర్తింపుకు అభ్యర్థులు రేషన్ కార్డు, ఆధార్, ఓటర్ కార్డ్ , కరెంట్, వాటర్ బిల్లు, ప్రభుత్వం ఇచ్చిన ఏదైనా గుర్తింపు కార్డు ఉండాలి. ఇవి ఏమి లేకపోతె తహసిల్ధార్ ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని స్థానికతకు ఆధారంగా పరిగణించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది.