iDreamPost
iDreamPost
ఎక్కడలేని విధంగా ఒక్క తెలుగులోనే వారానికి అయిదుకి పైగా సినిమాలు విడుదలవుతున్నాయి. తమిళం హిందీలోనూ అతి కష్టం మీద ఒకటి రెండు రిలీజ్ చేయగలుగుతున్నారు కానీ టాలీవుడ్ తరహాలో ఇంకెక్కడా దూకుడు కనిపించడం లేదు. అలా అని మన థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డుతో కళకళలాడుతున్నాయనుకుంటే వేడి సాంబార్ లో కాలేసినట్టే. ఎందుకంటే నెంబర్ ఘనంగానే ఉంది కానీ టికెట్ కౌంటర్ల దగ్గర కలెక్షన్ల పర్వం మాత్రం అదో రకంగానే సాగుతోంది. అంతో ఇంతో పేరున్న హీరోల సినిమాలకు సైతం ఎక్కువ సెంటర్స్ లో మొదటి రోజే డెఫిషిట్లు పడుతున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఇక విషయానికి వద్దాం.
వచ్చే నవంబర్ 19న థియేటర్లలో ఏకంగా ఎనిమిది సినిమాలు రాబోతున్నాయి. ఊరికి ఉత్తరాన, మిస్టర్ లోన్లీ, పోస్టర్, రామ్ అసుర్, రావణలంక, సావిత్రి వైఫ్ అఫ్ సత్యమూర్తి, స్ట్రీట్ లైట్ చిత్రాలతో పాటు నేరగాడు అనే డబ్బింగ్ మూవీని కూడా తీసుకొస్తున్నారు. వీటిలో దేనికీ కనీస బజ్ లేదు. ఉన్నంతలో రెండు మూడు యూనిట్లు ప్రమోషన్లు చేస్తూ మీడియాలో హై లైట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి కానీ ఇవి ఎంత వరకు ఉపయోగపడతాయో చెప్పలేం. కనీసం విడుదలైన విషయం జనానికి తెలియాలన్నా ఇది తప్పదు. తక్కువ థియేటర్లు ఉండే చాలా సెంటర్స్ లో కొన్ని రిలీజయ్యే ఛాన్స్ కూడా లేదు. ఇన్నేసి వస్తే ఎవరైనా ఏం చేయగలరు
హిందీలో యాష్ రాజ్ సంస్థ నిర్మించిన బంటీ ఆర్ బబ్లీ 2 కూడా అదే రోజు రానుంది. దీని మీద నార్త్ సర్కిల్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. కంటెంట్ బాగుంటే తెలుగు రాష్ట్రాల ఏబి సెంటర్స్ లో చెప్పుకోదగ్గ వసూళ్లు దక్కించుకోవచ్చు. శుబ్ రాత్రి, ఏ మర్డ్ బేచారా కూడా వస్తున్నాయి. వీటి గురించి ఎలాంటి సౌండ్ లేదు. మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ కోసం హాలీవుడ్ మూవీ చార్ట్ బస్టర్స్ ఆఫ్టర్ లైఫ్ సైతం రేస్ లో దిగింది. ఇలా కౌంట్ చూసుకుంటే అంతా ఘనంగానే కనిపిస్తోంది కానీ ఇప్పటికిప్పుడు వీటి వల్ల బాక్సాఫీస్ కు వచ్చే ఉత్సాహం ఏమి లేదు. ఒకటో రెండో చాలా బాగున్నాయని టాక్ వస్తే తప్ప ఈ ఫ్రైడే చాలా డ్రైగా కనిపిస్తోంది. చూడాలి మరి
Also Read : Special OPS1.5 : స్పెషల్ ఓపిఎస్ 1.5 రిపోర్ట్