iDreamPost
iDreamPost
అత్త మీద కోపం దుత్త మీద చూపించింది అనేది సామెత. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిస్థితి ఇలాగే ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమాన్ని హైజాక్ చేయాలని టిడిపి ఆడుతున్న నాటకంలో చంద్రబాబు ఎంటరయ్యారు. అవడమే కాదు ముఖ్యమంత్రి జగన్ మీద ఒంటికాలి మీద లేచి, లేనిపోని విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకోవడం వరకూ బాగానే ఉన్నా, కేంద్రం వైఖరిని ప్రశ్నించాల్సిన కి పోయి ముఖ్యమంత్రి జగన్ మీద పడడం చంద్రబాబు నిజ స్వరూపాన్ని అద్దం పడుతోంది.
మొదట స్పందించింది ముఖ్యమంత్రే కదా
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రంలో జరిగే విషయాల మీద ఏ విధంగా స్పందించాలో ఎంత సమంజసంగా స్పందించాలో అలాగే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. కేంద్రం ఆధీనంలో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ తగదని, అది ఆంధ్రుల ఆత్మ గౌరవ ప్రతీక అని చెప్పడం తో పాటు, ప్రైవేటీకరణ కు వెళ్లకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే పరిశ్రమ మళ్లీ లాభాల్లోకి వస్తుందనేది పూర్తి వివరంగా ప్రధాని మోదీ కు జగన్ లేఖ రాశారు. అప్పటి వరకూ కనీసం విశాఖ ఉక్కు ఉద్యమంలో ఉన్న కార్మిక సంఘాలకు మద్దతు ఇవ్వడానికి కూడా భయపడిన టిడిపి నేతలు జగన్ లేఖ తో ఒక్కసారిగా భుజాలు తడుముకుని ఉద్యమం లోకి వచ్చారు. విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేస్తే, విశాఖ జిల్లా టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఏకంగా పార్టీ కార్యాలయంలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. కార్మిక సంఘాలకు సంఘీభావం తెలిపి, వారి సమక్షంలోనే ఆమరణదీక్షకు దిగాల్సిన నేతలు పార్టీ కార్యాలయాలను వేదిక చేసుకోవడం గమనించదగిన అంశం.
ఇక చంద్రబాబు వంతు!
ఏ ఉద్యమాన్ని అయినా హైజాక్ చేయడంలో ముందుండే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విశాఖ ఉక్కు ఉద్యమాన్ని సైతం టీడీపీ పార్టీకు సంబంధించిన ఉద్యమంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే మంగళవారం విశాఖ వెళ్లిన చంద్రబాబు ఆమరణ దీక్ష లో కూర్చున్న పల్లా శ్రీనివాసరావు పరామర్శించి అక్కడే సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మీద రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మీద సంబంధం లేని వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి సంఘీభావం తెలపడానికి వెళ్లిన చంద్రబాబు దానిని పూర్తిగా వదిలిపెట్టి కేవలం వ్యక్తిగత విమర్శలకు వెళ్లారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను కేంద్రం వైఖరి మీద కనీసం మాట్లాడకుండానే చంద్రబాబు ప్రసంగం సాగింది. అమరావతి రాజధాని మీద, వైకాపా పాలన మీద, కొద్దిసేపు విజయసాయి రెడ్డి మీద, మరి కొద్దిసేపు తనకు తెలిసిన కాస్త చరిత్ర మీద మాట్లాడి మమ అనిపించారు. ఈ ప్రసంగాన్ని మొదటి నుంచి చివరి వరకు పచ్చ మీడియా లైవ్ ఇచ్చి తన ఆనందాన్ని చూపించుకుంది.
మోదీ అనరు అనలేరు
బీజేపీతో మళ్లీ జట్టు కట్టడానికి ఉవ్విళ్లూరుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రధాని మోడీ కనీసం ఒక మాట అని ఎందుకు సైతం ఇష్టపడటం లేదు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశం పూర్తిగా కేంద్రం చేతుల్లో ఉంది. అలాంటప్పుడు ఉద్యమంలోనూ కేంద్రం వైఖరిని ప్రశ్నించాల్సిన కి పోయి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడడం చూస్తుంటే మోదీ మీద గౌరవం కన్నా భయమే ఎక్కువ గా ఉందన్న మాటలు అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. విశాఖ ఉక్కు ఉద్యమం సభ లో ఏవేవో మాట్లాడి, పచ్చ మీడియా కు ఫుల్ జోష్ ఇవ్వడంలో మాత్రం చంద్రబాబు విజయం సాధించారు.