iDreamPost
android-app
ios-app

డబుల్ డోస్ మాస్ తో రామ్ ‘రెడ్’

  • Published Dec 24, 2020 | 6:16 AM Updated Updated Dec 24, 2020 | 6:16 AM
డబుల్ డోస్ మాస్ తో రామ్ ‘రెడ్’

లాక్ డౌన్ వల్ల ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన రామ్ కొత్త సినిమా రెడ్ సంక్రాంతి విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ సందర్భంగా ట్రైలర్ ని విడుదల చేశారు. ఇందులో రామ్ మొదటిసారి డ్యూయల్ రోల్ చేశాడు. తమిళ హిట్ మూవీ తడంకు రీమేక్ గా రూపొందిన రెడ్ మీద ముందు నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. అందులోనూ ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో బిజినెస్ పరంగానూ క్రేజ్ నెలకొంది. దాంతో వచ్చిన మాస్ ఇమేజ్ ని కాపాడుకునే ఉద్దేశంతో ప్రత్యేకంగా రెడ్ ని ఎంచుకున్నాడు రామ్. తనతో గతంలో రెండు సినిమాలు చేసిన తిరుమల కిషోర్ దర్శకుడు.

కథ చెప్పీ చెప్పనట్టు అసలు గుట్టు దాచి చెప్పారు. జీవితంలో ఓ అమ్మాయిని చూసి తొలిచూపులోనే ప్రేమించిన ఓ యువకుడు తనని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ కావాలని కలలు కంటూ ఉంటాడు. కానీ ఊహించని రీతిలో జరిగిన ఓ అనూహ్య సంఘటన వల్ల ఆమె దూరమవుతుంది. దీని వెనుక అచ్చం తనలాగే ఉండే ఓ రౌడీ హస్తం ఉందని గుర్తిస్తాడు. ఇద్దరి మధ్య దోబూచులాట మొదలవుతుంది. పోలీసులు రంగప్రవేశం చేస్తారు. అసలు ఈ ఇద్దరూ ఎవరు, అన్నదమ్ములా లేక మాయమైన ఆ యువతికి వీళ్లకు లింక్ ఏమైనా ఉందా లాంటి ప్రశ్నలకు సమాధానం వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

ట్రైలర్ ని చాలా ఆసక్తికరంగా కట్ చేశారు. రెండు పూర్తి విరుద్ధమైన మనస్తత్వాలు కలిగిన షేడ్స్ లో రామ్ కనిపించాడు. రెగ్యులర్ గా చూసే సాఫ్ట్ అండ్ మాస్ లా కాకుండా ఏదో డిఫరెంట్ గా ట్రై చేశారు. తన స్కూల్ కి భిన్నంగా తిరుమల కిషోర్ ఈసారి మాస్ క్రైమ్ థ్రిల్లర్ ని హ్యాండిల్ చేశాడు. మణిశర్మ సంగీతం బాగా ఎలివేట్ అయ్యింది. పోలీస్ ఆఫీసర్ గా నివేత థామస్ కు ఎక్కువ స్పాన్ ఉన్న పాత్ర దొరికింది. మాళవిక,శర్మ అమ్రితా అయ్యర్ మరో ఇద్దరు హీరోయిన్లు. పోసాని, సంపత్ రాజ్, వెన్నల కిషోర్, సత్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు. రామ్ మరోసారి తన టైమింగ్ తో క్లాస్ ప్లస్ మాస్ క్యారెక్టర్స్ ని ఆడుకున్నాడు. మొత్తానికి హైప్ పెంచేలా చేయడంలో టీమ్ సక్సెస్ అయ్యింది.

Trailer Link @ http://bit.ly/34GJcpZ