Idream media
Idream media
ఆర్థిక మాంద్యంతో ఒక వైపు వ్యవసాయ ఉత్పత్తులకి ధరలు పడిపోతూ ఉంటే కరోనాతో మిరప రైతుకి కొత్త కష్టం వచ్చింది. చేతికొచ్చిన పంటని అమ్మడానికి వ్యవసాయ మార్కెట్లకి తెస్తున్నారు. సహజంగానే మిరప ఘాటుకి తుమ్ములు, దగ్గు వస్తాయి. మార్కెట్లో తుమ్మినా, దగ్గినా చుట్టుపక్కల వాళ్లు భయంతో అనుమానంగా చూస్తున్నారు. మార్కెట్ ఉద్యోగులు కూడా ఆ పంటని ముట్టుకోడానికి జంకుతున్నారు. తుమ్మకుండా, దగ్గకుండా మిరపని అమ్మడం ఎలా అని రైతులు కంగారు పడుతున్నారు.
– మరో వైపు ముంబయ్ చరిత్రలో మొదటిసారిగా డబ్బావాలాలు తమ సేవల్ని నిలిపివేశారు. ముంబయ్ మతకలహాలు, ఉగ్రవాదుల దాడి సమయంలో కూడా డబ్బావాలాలు పనిచేశారు. కరోనా వాళ్లని ఆపేసింది.
-విదేశీయులు ఎవరైనా రైళ్లలో కనిపిస్తే వాళ్ల చేతుల్ని పరిశీలిస్తున్నారు. క్యారంటైన్ అనే ముద్ర కనిపిస్తే దించేస్తున్నారు.
-విమాన కంపెనీలన్నీ ఈ నెల నుంచి ఉద్యోగుల జీతాలు కట్ చేస్తున్నాయి. పూర్తిగా నష్టాలు వచ్చాయి కాబట్టి కనీసం 25 శాతం కోత విధిస్తున్నాయి.
-పెళ్లిళ్లకి ఎక్కువ మందిని అనుమతించిన ఫంక్షన్ హాళ్లను సీజ్ చేస్తున్నారు.
-ముంబయ్‌లో జనసమ్మర్థగా ఉన్న మార్కెట్లన్నీ మూసి వేశారు.
-విదేశీయులు ఎక్కువగా తిరిగే గోవాలో ఇప్పటి వరకు ఒకే ఒక్క కేసు నమోదు కావడం విశేషం. గోవాలో ప్రధాన ఆకర్షణగా ఉండే కాసినోలని మూసేశారు.
-కరోనా నివారణ కోసం చాలా చోట్ల యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారు. కానీ ఆ పొగకి దగ్గు వస్తే, దాన్ని ఆపడం కష్టంగా ఉంది.
-హైదరాబాద్‌లో సూపర్ మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి.ఎందుకైనా మంచిదని నెలకి సరిపడే సరుకులు కొనేస్తున్నారు.
-నకిలీ శానిటైజర్లు మార్కెట్‌ని ముంచెత్తుతున్నాయి.
-చేతులు కడుక్కోడానికి , గొంతు తడుపుకోడానికి ఆల్కాహాల్ కొరత లేదు.
-పర్మిట్ రూమ్‌లు లేక మందుబాబులు రోడ్డు మీదే తాగుతున్నారు. వాళ్ల ఆగడాలకి కరోనా కూడా పారిపోయేలా ఉంది.