Swetha
సినిమా రిలీజ్ కు పట్టుమని పదిహేను రోజులు ఉంది . కానీ సినిమాకు సంబంధించి ట్రైలర్ తప్ప ఇంకా ఎలాంటి అప్డేట్స్ బయటకు రాలేదు. ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలో ఉన్న మాట నిజమే.. ఎలాగూ ఉన్నారు కాబట్టి సినిమాకు బజ్ దాని అంతటా అదే వస్తుంది అని అనుకోవడం భ్రమ.
సినిమా రిలీజ్ కు పట్టుమని పదిహేను రోజులు ఉంది . కానీ సినిమాకు సంబంధించి ట్రైలర్ తప్ప ఇంకా ఎలాంటి అప్డేట్స్ బయటకు రాలేదు. ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలో ఉన్న మాట నిజమే.. ఎలాగూ ఉన్నారు కాబట్టి సినిమాకు బజ్ దాని అంతటా అదే వస్తుంది అని అనుకోవడం భ్రమ.
Swetha
సినిమా రిలీజ్ కు పట్టుమని పదిహేను రోజులు ఉంది . కానీ సినిమాకు సంబంధించి ట్రైలర్ తప్ప ఇంకా ఎలాంటి అప్డేట్స్ బయటకు రాలేదు. ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలో ఉన్న మాట నిజమే.. ఎలాగూ ఉన్నారు కాబట్టి సినిమాకు బజ్ దాని అంతటా అదే వస్తుంది అని అనుకోవడం భ్రమ. ఎందుకంటే ఇప్పుడు రోజులు మారాయి. ఎంతటి పాన్ ఇండియా హీరో సినిమా అయినా సరే ప్రమోషన్స్ లేనిదే పని జరిగేలా లేదు. పైగా వార్ 2 సినిమాకు పోటీగా కూలి సినిమా కూడా దిగుతుంది. కాబట్టి ఇంకాస్త పకడ్బందీగా మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ను ప్లాన్ చేయాలి. కానీ ఇక్కడ చూస్తే వాతావరణం చాలా సైలెంట్ గా ఉంది.
తెలుగులో వార్ 2 హక్కులను నాగవంశీ దక్కించుకున్నారు. కానీ ఇటు ఆయన నుంచి కూడా ఎలాంటి అప్డేట్ లేదు. గతంలో దేవర సినిమ విషయంలో కూడా ఇదే జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ నైతే ప్లాన్ చేశారు కానీ.. క్రౌడ్ బాగా ఎక్కువ ఉండడంతో ఆ ఈవెంట్ కాస్త క్యాన్సిల్ అయింది . ఇక ఇప్పుడు వార్ 2 ఈవెంట్ కు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్స్ లేవు కానీ ఒకవేల ఈవెంట్ జరిగితే కనుక.. ఈసారి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తారేమో చూడాలి. ఇదంతా వీలైనంత త్వరగా ప్లాన్ చేస్తే బెటర్ అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
ఈ మధ్యే నాగవంశీ కింగ్డమ్ మూవీ ఈవెంట్ ను భారీగా జరిపించారు. సో వార్ 2 కు కూడా అంతకుమించి ఉంటుందని తారక్ అభిమానులు. సో ఎన్టీఆర్ అభిమానులను శాటిస్ఫై చేయాలంటే ఈవెంట్ కు సంబందించిన అప్డేట్స్ త్వరగా ఇవ్వాల్సిందే. ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు ఏ ఏ అప్డేట్స్ వస్తాయా అని ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.సో ఇప్పుడు బజ్ పెంచడం అనేది మేకర్స్ వంతు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.